యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కేరళకు రూ. 700 కోట్ల సాయం ప్రకటించిందని, దాన్ని మోడీ సర్కారు తిరస్కరించిందనీ.... గత మూడు రోజులుగా ఆసక్తికరమైన చర్చ నడుస్తున్న క్రమంలో భారత్ లోని యూఏఈ అంబాసిడర్ అల్బనా తాజా ప్రకటన మరోలా ఉంది.

అధికారికంగా
యూఏఈ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి సాయాన్ని ప్రకటించలేదని, రూ. 700 కోట్ల సాయంపై తామింకా నిర్ణయానికి రాలేదని ఆయన పేర్కొన్నారు. చేయాల్సిన ఆర్థిక సాయం ఎంతుండాలనే విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని, దాని మీద ఆలోచనలు సాగుతున్నాయని చెప్పారు. రూ. 700 కోట్లు తుది నిర్ణయం కాదన్నారు.

పినరాయి విజయన్
దీంతో సీఎం పినరాయి విజయన్ ప్రధానికి రాసిన లేఖ, కేరళ మంత్రి విమర్శల మీద పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. యూఏఈ సాయం రాజకీయ రంగు పులుముకుంటున్న దశలో యూఏఈ రాయబారి నుంచే ప్రకటన రావడం విశేషం.

ఇక దీనికి కేంద్రం చేస్తున్న సహాయం
వరుణుడి ప్రకోపానికి గురైన కేరళకు చేసిన సాయంపై కేంద్రం వివరణ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇచ్చిన రూ.600 కోట్లు కేవలం అడ్వాన్స్ అసిస్టెన్స్ మాత్రమే అని వివరణ ఇచ్చింది. మరిన్ని నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది

చేతులు దులిపేసుకుందని
కేరళకు విదేశీ సాయంపై కేంద్రం, కేరళ మధ్య రగడ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. యూఏఈ సాయం ఎందుకు తీసుకోకూడదని కేరళ సీఎం కేంద్రాన్ని ప్రశ్నించారు. తాము రూ.2,200 కోట్లు అడిగితే... కేంద్రం కేవలం రూ.600 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుందని కేరళ సీఎం ఆరోపించారు

కేంద్రం వివరణ
దీనిపై స్పందించి కేంద్రం వివరణ ఇచ్చింది. రూ.600 కోట్లు మినహాయించి మిగతా సొమ్మును నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కింద విడుదల చేస్తామని ప్రకటించింది. కేంద్రం అత్యవసర కింద నిధులు, మెటీరియల్ ఇచ్చిందని గుర్తు చేసింది.

వరద బాధితుల కోసం
నిధులతో పాటు వరద బాధితుల కోసం 40 హెలికాప్టర్లు, 31 ఎయిర్ క్రాఫ్ట్స్,182 రెస్క్యూ టీములు,18 డిఫెన్స్ ఫోర్స్ మెడికల్ టీమ్స్, 58 ఎన్డీఆర్ఎఫ్ టీములు, 500 బోట్లతో సెంట్రల్ ఆర్మడ్ ఫోర్స్ ను పంపి సుమారు 60,000 మందిని కాపాడామని కేంద్రం తెలిపింది.


Click it and Unblock the Notifications