దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే వేళ 2022 నాటికి ప్రతి కుటుంబం సొంత ఇల్లు సమకూర్చుకోవాలన్నది తన కల అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం
కేంద్ర గృహనిర్మాణ పథకం ప్రయోజనాలను అందిపుచ్చుకోవడానికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తన ప్రభుత్వంలో కమీషన్లు చెల్లించే వ్యవస్థకు చోటు లేదని చెప్పారు. గుజరాత్‌లోని వల్సద్ జిల్లా జుజ్వా గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్లలో సామూహిక గహప్రవేశ కార్యాక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.

బహిరంగ సభలో
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సొంతిళ్లు పొందిన మహిళలతో ఈ రోజు నాకు మాట్లాడే అవకాశం వచ్చింది రక్షా బంధన్ పండుగకు ఆడపడుచులకు సొంతిళ్లు ఇవ్వడం కన్నా గొప్ప బహుమతి ఏదీ ఉండదు ఆ పండుగకు కొన్ని రోజుల ముందే గుజరాత్‌లోని లక్ష మంది మహిళలు సొంతిళ్లు పొందారు

సొంతిళ్లు
అలాగే, భారతీయులందరికీ 2022లోపు సొంతిళ్లు ఉండాలన్నదే నా కల. ఆ ఏడాదే భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనుంది. ఇప్పటి వరకు రాజకీయనాయకులు సొంతిళ్లు నిర్మించుకున్నారనే వార్తలనే మనం విన్నాం ఇప్పటి నుంచి పేదలు సొంతిళ్లు పొందారనే వార్తలు వింటాం అని మోదీ అన్నారు.

పేదల వద్దకే
ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద ఇళ్లు పొందేందుకు ఎటువంటి లంచాలు ఇచ్చుకునే అవసరం లేదు. ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే మధ్యవర్తులను సంప్రదించాల్సిన పని లేదు. అప్పట్లో బ్యాంకులు పేదలకు అప్పులిచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు అవి పేదల వద్దకే వచ్చి రుణాలిస్తామని అంటున్నాయి. గుజరాత్ నాకు ఎన్నో నేర్పించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు పొందడంలో మహిళలు ఎంతో సంతప్తి వ్యక్తం చేస్తున్నారు.

మాజీ ప్రధాని
ఒక్క రూపాయి కూడా లంచం ఇచ్చే అవసరం రాలేదని నాతో చెప్పారు" అని మోదీ అన్నారు. అభివద్ధి పథకాలకు ఢిల్లీ నుంచి ఒక రూపాయి విడుదలైతే మొత్తం నూరు పైసలూ పేద కుటుంబానికి చేరతాయని అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ గతంలో కేంద్రం విడుదల చేసే ప్రతి రూపాయిలో కేవలం 15పైసలే లబ్ధిదారుడుకి చేరుతోందని ఆందోళన వ్యక్తం చేసిన సంగతి గుర్తు చేస్తూ ప్రధాని పైవిధంగా వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications