కేరళ వరదల వల్ల కలిగిన నష్టం మాటలో చెప్పలేనిది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అందరు దయాహృదయంతో సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఆఖరికి చిన్నపిల్లలు కూడా తమ కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బును కూడా ఇచ్చేస్తున్నారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
విదేశాలు కూడా ముందుకువచ్చి తమ విరాళాలు కూడా ప్రకటించాయి. ప్రముఖంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కేరళ రాష్ట్రానికి రూ.700 కోట్ల సహాయం అందించాడని ముందుకువచ్చింది.

భారత ప్రభుత్వం
కానీ ఇంత భారీ విరాళాన్ని మన భారత ప్రభుత్వం స్వీకరించడానికి నిరాకరిస్తోంది. ఇంతకీ ఎందుకు భారత కేంద్రం ఇంత మొత్తం విరాళాన్ని స్వీకరించడం లేదు అని కేరళ వరద కారణాల కన్నా ఎక్కువ దీని గురించే చెర్చలు జరుగుతున్నాయి.

కారణం
దీనికి కారణం మన భారత ప్రభుత్వం మొత్తం కేరళ వరద సహాయం మొత్తం ఇస్తానన్న మొత్తం విరాళం రూ.680 కోట్లు .కానీ దీనికి కేరళ ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన విరాళం కన్నా ఎక్కువ విరాళాలు మాకు వస్తాయి అని చెప్పింది.

కేరళ రాష్ట్రానికి
కేరళ ప్రభుత్వం చెప్పింది నిజమైంది. ప్రస్తుతానికి కేరళ రాష్ట్రానికి విరాళాల వరద చుట్టుముడుతోంది. ఈ విరాళాలతో అన్నిటికన్నా ఎక్కువ వచ్చింది యూఏఈ దేశానిది. కానీ రకరకాల నిబంధనలు చూపి కేంద్రం కేరళకు అడిగిన సహాయం చేయడం లేదు.

కేంద్రం మరింత విరాళం
దీనికి అంత కారణం యూఏఈ దేశం ప్రకటించిన విరాళం రూ.700 కోట్లు మన కేంద్రం ప్రకటించిన రూ.680 కోట్లన్నా ఎక్కువ ఉండడం అని అందరు అనుకుంటున్నారు.నిజానికి పరిస్థితి , త్రీవ్రత చూసి కేంద్రం మరింత విరాళం ప్రకటించింది.

యూపిఏ ప్రభుత్వం
అయితే యూపిఏ ప్రభుత్వం హయాంలో 2004 లో విదేశీ సహాయం పై ప్రకటించిన విధానాన్ని తాము పాటిస్తున్నాము అని కేంద్ర మంత్రులు చెప్పుకొచ్చారు.ఏదిఏమైనా అంతిమ నిర్ణయం కేంద్రం తీసుకుంటుంది అని చెప్పారు.

నగదు కావడంతో
యూఏఈ దేశం ఇస్తానన్నది నగదు కావడంతో సమస్య వచ్చింది అని పశ్చిమ ఆసియాలో పని చేసిన మాజీ గౌత్యవేత్త తాల్మిజ్ అహమ్మద్ అభిప్రాయపడ్డారు. నగదు సహాయం తీసుకుంటే ప్రజలను ఆదుకొనేందుకు తమ వద్ద నగదు లేదు అని కేంద్రం అంగీకరిచిన్నట్లు అవుతుంది అని అయన అంటున్నారు.మందులు మరియు ఆహార పదార్థాలు , వస్తువుల సహాయం వేరు అని ఇలా నగదు తీసుకొనే ఆచారం లేదు అని అయన అన్నారు.

గుజరాత్ లో
గుజరాత్ లో భూకంపం వచ్చినపుడు సౌదీ అరేబియా విమానాల నిండా మందులు పంపించింది అని ఇప్పుడు ఇలా నగదు ఇస్తే భారత కేంద్రం దగ్గర డబ్బులు లేవు అని అనుకుంటున్నారు అని అయన చెప్పారు.

కేరళకు మరియు యూఏఈ
కేరళకు మరియు యూఏఈ వంటి గల్ఫ్ దేశాలకు మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు అందరికి తెలిసినవే అని ఇప్పటికి 80 లక్షల భారతీయ కార్మికులలో 35 లక్షల మంది కేరళ వాసులే అందుకే యూఏఈ కేరళ వరదల గురించి తెలిసిన వెంటనే ఆగమేఘాల మీద స్పందించింది అని దీని మన కేంద్రం ఆహ్వానించాలి అని అందరు అనుకుంటున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications