కేరళకు యుఏఈ సహాయనిధిని కేంద్రం తిరస్కరించేందుకు గల కారణాలు ఇవేనా?
భారీ వర్షాలు కారణంగా వరదలు పోటెత్తడంతో కేరళ రాష్ట్రము అతలాకుతలం ఐపోయి జనజీవనం స్తంభించిపోయింది,రాష్ట్రము లో అనేక ప్రాంతాలు జల దిగ్బంధం లో చిక్కుకుపోయాయి.
భారీ వర్షాలు కారణంగా వరదలు పోటెత్తడంతో కేరళ రాష్ట్రము అతలాకుతలం ఐపోయి జనజీవనం స్తంభించిపోయింది,రాష్ట్రము లో అనేక ప్రాంతాలు జల దిగ్బంధం లో చిక్కుకుపోయాయి,నివాసాల్లోకి వరదనీరు చేరడంతో జనాలను పునరావాస కేంద్రాలకు తరలించ్చారు.

అపార నష్టం:
అపార నష్టం వాటిల్లింది,అంచనా సుమారు రూ.20 ,000 కోట్లు ఉండొచ్చని కేరళ ప్రభుత్వం అంచనా వేసింది.ఈ నేపథ్యం లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేక రాస్తూ వెంటనే తక్షణ సహాయం గా రూ.2 ,000 కోట్లు సహాయ నిది విడుదల చేయాలని కోరింది.ఇంతవరకు కేంద్ర కేవలం రూ.600 కోట్లు మాత్రమే విడుదల చేసింది,దింతో కేంద్రం పై కేరళ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాష్ట్రాలు స్వచ్ఛందంగా:
ఇదిలా ఉండగా దేశం లోని అనేక రాష్ట్రాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కేరళకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి,అనేక స్వచ్ఛంద సంస్థలు,మరియు పారిశ్రామిక వేత్తలు అలాగే సినీ ప్రముఖులు క్రీడా కారులు తమవంతు సహాయం చేస్తున్నారు.

యుఏఈ(UAE):
ఈ విపత్తును గమనించిన యుఏఈ(UAE) భారీ సహాయ నిది అందివ్వడానికి ముందుకొచ్చింది,కానీ కేంద్రం ఈ సహాయాన్ని తిరస్కరించిఉంది.నిబంధనల ప్రకారం విదేషాలు అందించే నగదు విరాళాన్ని తీసుకునే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.ఐతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ సాయాన్ని తిరస్కరించారన్న వాతాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేరళ పునఃనిర్మాణం:
దయనీయ పరిస్థితుల్లో ఉన్న కేరళ పునఃనిర్మాణం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారీ విరాళం ప్రకటించింది.సుమారు $100 మిలియన్ డాలర్లు అంటే రూ.700 కోట్లు సాయం చేస్తామని ముందుకొచ్చింది,ఐతే కేంద్ర ప్రభుత్వం ఈ సాయాన్ని తిరస్కరించే అవకాశం కనిపిస్తోంది.

మన్మోహన్ సింగ్ ప్రభుత్వం:
2004 లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విపత్తు సహాయం విధానం ప్రకారం యుఏఈ సర్కారు సహాయాన్ని అంగీకరించే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి.

విపత్తు సమయం:
భారత్ 2004 నుండి విపత్తు సమయంలో ఎలాంటి విదేశీ సహాయాన్ని తీసుకోడంలేదు,2013 నాటి ఉత్తరాకాండ్ వరదలు ఆ తరువాత వచ్చిన కాశ్మీర్ వరదలకు కేంద్రం ఎటువంటి విదేశీ సహాయం తీసుకోలేదు.విపత్తును ఎదురుకొనే శక్తి భారత్ కు ఉందనే ఉద్దెశంతో 2004 లో నూతన విపత్తు సహాయ విధానాన్ని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అమల్లోతెచ్చింది.

విమర్శలు:
కేరళకు యుఏఈ ప్రకటించిన సాయాన్ని తిరస్కరించడానికి గల కారణం ఇదేనని కేంద్రం చెప్తోంది,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించిన భారీ విరాళాన్ని తిరస్కరించిన విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది,కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయ నిది కంటే యుఏఈ సంఖ్య ఎక్కువ ఉండటం కారణంగా మోడీ సర్కారు దీన్ని తిరస్కరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విదేషాలు అందించే:
పైగా విదేశీ సహాయం తీసుకుంటే ప్రజలను ఆదుకునేందుకు అవసరమైన డబ్బు తమ వద్ద లేదని కేంద్రం ఒప్పుకున్నట్టు అవుతుందని మరో వాదన వినిపిస్తోంది,విదేషాలు అందించే ఆహరం,మందులు వంటి వాస్తు రూపంలో అందించే సహాయం అంగీకరించడానికి అవకాశం ఉంది కానీ నగదు తీసుకునే నిబంధన ప్రస్తుతం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.


Click it and Unblock the Notifications