సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనేందుకు ఇష్టపడే వారి కోసం ఫ్లిప్‌కార్ట్ కొత్త సౌలభ్యం తీసుకొచ్చింది. '2GUD' పేరిట కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. ఇందులో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, ట్యాబెట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. త్వరలో మరిన్ని కేటగిరీలను తీసుకొస్తామని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి మీడియాకు తెలిపారు.
ప్రస్తుతం మొబైల్ వెబ్‌లోనే దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని, త్వరలో డెస్క్‌టాప్, మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని కృష్ణమూర్తి వెల్లడించారు. పాత వస్తువులు కొనాలి అనుకునే వారికోసం దీన్ని ప్రత్యేకంగా తీసుకొస్తున్నామని, కొత్త వస్తువుల కొనుగోలుకు ఫ్లిప్‌కార్ట్ యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. రీఫర్బిష్డ్ వస్తువుల కొనాలి అనుకునేవారి తొలి ఛాయిన్ '2గుడ్' కావాలని తాము కోరుకుంటున్నామని, ఈ కామర్స్ మార్కెట్‌లో అగ్రగామిగా నిలవాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు.

ఆయా వస్తువుల కొనుగోలుపై 3 నుంచి 12 నెలల వారెంటీని తమ విస్తృతమైన నెట్‌వర్క్ ద్వారా అందిస్తామని కృష్ణమూర్తి చెప్పారు. చెల్లింపులు, రవాణా విషయంలోనూ కొనుగోలుదారుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరని హామీ ఇచ్చారు. '2గుడ్' ద్వారా కొనుగోలు ప్రక్రియను సులభతరం చేశామని, ఇందులోనూ ఫ్లిప్‌కార్ట్ తరహాలో నాణ్యమైన వస్తువులు విక్రయిస్తామని ఫ్లిప్‌కార్ట్ వైస్‌ప్రెసిడెంట్ అనిల్ గొటేటి వెల్లడించారు. '2గుడ్'కు ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. ఈబే ఇండియాను ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసిన అనంతరం పునర్‌వ్యవస్థీకరించి ప్రారంభించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications