ముందుకొచ్చిన బాబా రామ్ దేవ్ కేరళకు రూ.2 కోట్లు సహాయం పతంజలి ప్రొడక్ట్స్
వరదలతో అల్లకల్లోలం అవుతున్న కేరళకు రూ.2 కోట్లు సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా చెప్పారు. ఇప్పటికే రూ.50 లక్షల విలువ చేసే వాటిని పంపించామన్నారు.

పతంజలి సమృద్ధి కార్డును
దేశంలో ఎక్కడ ఆపద వచ్చినా పతంజలి సంస్థ ఆదుకుంటుందన్నారు. విజయవాడ సమీపంలో యోగా గురువుల సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం గన్నవరం స్పైస్‌జెట్ విమానంలో హైదరాబాద్ నుంచి ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ పతంజలి సమృద్ధి కార్డును అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.

బీమా
పేద ప్రజలకు రూ.5 లక్షలు బీమా కల్పిస్తామన్నారు. కార్డు పొందిన వారికి పతంజలి ప్రొడక్ట్స్‌ను తక్కువ ధరకే అందిస్తామన్నారు. ఇప్పటి వరకూ ఇటువంటి సౌకర్యాలను ఏ ప్రభుత్వం కల్పించలేదన్నారు. ప్రజలు వారి అభిరుచుల మేరకు జీవించే హక్కు ఉందన్నారు. ఏ వస్తువైనా వాడుకోవచ్చని చెప్పారు.

పతంజలి సంస్థ
దేశంలో పతంజలి సంస్థ 20వేల మందికి ఉపాధి కల్పించిందని, రెండు నెలల్లో మరో 20వేల మందికి ఉపాధి చూపనుందన్నారు. నిరుద్యోగం రూపుమాపటం, అక్షరాస్యతను పెంచటం, పేదరిక నిర్మూలనకు సంస్థ పాటుపడుతుందన్నారు.

ఏపీలో
పతంజలికి దేశం ఒక మార్కెట్ కాదని కుటుంబంగా భావిస్తున్నామని, అంతా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. విదేశీ కంపెనీలు దేశ సంపదను కొల్లగొడుతున్నాయన్నారు. ఏపీలో త్వరలో వెయ్యి మందికి ఉపాధికల్పిస్తామని చెప్పారు.

చంద్రబాబు అంటే
సీఎం చంద్రబాబు అంటే ఎంతో అభిమానమన్నారు. ఆయన సారధ్యంలో అమరావతి అభివృద్ధిలో మందుకు వెళుతుందని చెప్పారు. యోగా గురువులను కార్మికులుగా గుర్తించి వేతనం ఇవ్వాలని ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలను కోరుతున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications