వాట్సాప్ ద్వారా సర్క్యేలేట్ అవుతున్న నకిలీ మెసేజ్‌లు ఎక్కడినుంచి పుట్టుకొచ్చాయో గుర్తించేందుకు అవసరమైన టెక్నాలజీని రూపొందించడంతో పాటు దేశంలో కార్పొరేట్ సంస్థను ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

రవిశంకర్ ప్రసాద్
వాట్సాప్ అధినేత క్రిస్ డేనియల్స్ ఇండియా పర్యటన సందర్భంగా ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశం అయ్యారు. దేశ డిజిటల్ రంగం అభివృద్ధికి వాట్సాప్ కృషి అభినందనీయమే అయినప్పటికీ, మూకస్వామ్యం, అశ్లీలదృశ్యాల ప్రచారం వంటి చెడ్డ పరిణామాలను అరికట్టేందుకు పరిష్కారాలను కనిపెట్టాలని రవిశంకర్ ప్రసాద్ కోరారు

క్రిస్ డేనియల్స్
వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్స్‌తో సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సాంకేతిక అవగాహనను కల్పించడంలో వాట్సాప్ చేసిన కృషిని అభింనందించారు. అయితే మూకస్వామ్యం, రివేంజ్ పోర్న్ వంటి మెసేజ్ లను అరికట్టడానికి సాంకేతిక పరిష్కారాలను కొనుక్కోవాల్సిన సూచించినట్టు తెలిపారు,. దేశీయంగా క్రిమినల్ చట్టాల ఉల్లంఘన జరగకుండా పరిష్కారాలుండాలని అన్నారు.

వాట్సాప్
దేశంలో వాట్సాప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన కంప్లయెన్స్ అధికారిని కూడా నియమించాలని వాట్సాప్ కోరినట్టు ఆయన వెల్లడించారు. తప్పుడు మెసేజ్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో తెలసుకోవడానికి రాకెట్ సైన్స్ అవసరంలేదని, అందుకు తగిన పరిష్కారాన్ని కనుక్కోవడానికి యంత్రాంగం ఉంటే చాలునని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

సోషల్ మీడియా
ఒకవేళ వాట్సాప్ ఈ దిశగా చర్యలు తీసుకోకపోతే ప్రేరేపణ చర్యలకు పాల్పిన నేరారోపణలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ అంశాలకు సంబంధించి పరిష్కారాల దిశగా వాట్సాప్ హామి ఇచ్చినట్టు తెలిపారు. అయితే ఈ సమావేశ వివరాలను వెల్లడించడానికి వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్స్ నిరాకరించారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని చేరవేయకుండా ప్రజలకు అవగాహన కల్పించడానికి డేనియల్ అంగీకరించారని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications