ప్రముఖ ఇ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్ కార్ట్‌లో వాటాల కొనుగోలుపై అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) సెప్టెంబరు 28న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది.

వాల్‌మార్ట్
ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం 2016లో జారీచేసిన ప్రెస్ నోట్ నెం.3ని ఈ ఒప్పందం ఉల్లంఘించింది. ఈ కామర్స్‌ను అమలు చేయడం ద్వారా రిటైల్ వ్యాపారంపై పట్టు సాధించి, దానిని దెబ్బ తీసే దుర్మార్గపు ఆలోచనతోనే వాల్‌మార్ట్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అని సిఎఐటి కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు.

సెప్టెంబరు 15న
ఈ ఒప్పందంతో వాల్‌మార్ట్ వ్యూహాత్మకంగా ధరలు తగ్గించడం తోపాటు అత్యధిక డిస్కౌంట్‌లు ప్రకటించి ఇతర సంస్థలు మార్కెట్‌లో నిలువలేని పరిస్థితిని కల్పిస్తుందని అన్నారు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబరు 15న దేశ వ్యాప్తంగా రధయాత్రను కూడా చేపట్టనున్నామని సిఐఎటి ఆ ప్రకటనలో పేర్కొంది.

వ్యాపారస్తుల పట్ల
వ్యాపారస్తుల పట్ల అనుసరిస్తున్న వివక్షతను కూడా నిరసిస్తూ డిసెంబరు 16న మెగా ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపడతామని తెలిపింది. నాగపూర్‌లో శనివారం జరిగిన సిఐఎటి వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా ఉన్న 200 మంది వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.

ఫ్లిప్‌కార్ట్‌లో
ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం పూర్తయ్యిందని వాల్‌మార్ట్ శనివారం తెలిపింది. ఫ్లిప్ కార్ట్ వ్యాపారాన్ని పెంచేందుకు మరో 2 బిలియన్ డాలర్లనుపెట్టుబడిగా పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ ఒప్పందంపై దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా నగరాలలో వ్యాపారస్తులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ భారత్ వాణిజ్య బంద్‌లో పాల్గొంటున్నందును సెప్టెంబరు 28న మార్కెట్లు మూతపడనున్నాయి అని సిఐఎటి తన ప్రకటనలో పేర్కొంది

ఈ కామర్స్ రంగంలో
వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ తన ఎఫ్‌డిఐ విధానాలను ప్రెస్‌నోట్‌ల ద్వారా వెల్లడిస్తోంది. 2016లో విడుదల చేసిన ప్రెస్‌నోట్-3లో ఈ కామర్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కామర్స్ మార్కెట్లలోప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని యాజమాన్యపు హక్కును, డిస్కౌంట్‌లను అనుమతించడం జరగదని అందులో పేర్కొంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications