For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేరళ వరద బాధితులకి భారీ సహాయం ఇంతకీ ఎవరితను? మీరే చూడండి.

By Sabari
|

భారీ కుండపోత వర్షాలు, వరదల దెబ్బకు అల్లాడుతున్న కేరళ ప్రజలను ఆదుకొనేందుకు ఆపన్న హస్తాలు కదిలాయి.

దేశవ్యాప్తంగా

దేశవ్యాప్తంగా

దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు మేము సైతం అంటూ ఇతోధికంగా నగదు, ఆహారం, మందులు, దుస్తులు, ఇతర సామాగ్రిని అందజేస్తున్నారు.

డా.షంషీర్ వయలిల్

డా.షంషీర్ వయలిల్

వీరితో పాటు విదేశాల్లో స్థిరపడిన భారతీయులు కూడా మాతృదేశానికి వచ్చిన కష్టానికి స్పందిస్తున్నారు. తాజాగా అబుదాబీలో ఉంటున్న భారత సంతతి వ్యాపారవేత్త డా.షంషీర్ వయలిల్ కేరళకు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు

సొంత రాష్ట్రమైన

సొంత రాష్ట్రమైన

ఆయన సొంత రాష్ట్రమైన కేరళకు 26 మిలియన్ దుబాయ్ దిర్హమ్‌లను (దాదాపు రూ.50 కోట్లు) కోట్లు విరాళం ఇచ్చారు.

అబుదాబి

అబుదాబి

అబుదాబి కేంద్రంగా పనిచేసే వీపీఎస్ హెల్త్ కేర్ సంస్థకు చైర్మన్ అయిన షంషీర్ వయలిల్ కు మధ్య ఆసియా, భారత్, యూరప్ లలో మొత్తం 22 ఆసుపత్రులు, 125 మెడికల్ సెంటర్లు ఉన్నాయి.

రూ.50 కోట్ల

రూ.50 కోట్ల

డాక్టర్ షంషీర్ వయలిల్, తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులంతా కలిసి ఈ మొత్తాన్ని సమకూర్చి కేరళ వరద బాధితుల కోసం విరాళం ఇచ్చినట్టు సమాచారం. షంషీర్ రూ.50 కోట్ల మొత్తాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించారు.

 ప్రాజెక్ట్

ప్రాజెక్ట్

త్వరలోనే ఓ ప్రాజెక్ట్ ప్రారంభించి ఈ రూ.50 కోట్లని బాధితుల పునరావాసం, ఆరోగ్యం, విద్యకు ఖర్చు చేయనున్నట్లు షంషీర్ తెలిపారు. వరదలకు తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ఆస్తుల విలువ

ఆస్తుల విలువ

ఇంత భారీ మొత్తం సాయం అందజేసిన షంషీర్ కుటుంబం కేరళ నుంచే అబుదాబికి వెళ్లింది. తాజా అంచనాల ప్రకారం షంషీర్ ఆస్తుల విలువ 1.7 బిలియన్ డాలర్లు(రూ.11,832 కోట్లు)

ఆస్తిలో సగం

ఆస్తిలో సగం

షంషీర్ అపర కుబేరులు బిల్ గేట్స్, వారన్ బఫెట్ 2010లో ప్రారంభించిన ‘గివింగ్ ప్లెడ్జ్'లో భాగం పంచుకుంటున్నారు. ఇందులో పాల్గొనేవారు తమ ఆస్తిలో సగం సమాజ కార్యక్రమాలకు వినియోగిస్తారు

Read more about: funds
English summary

కేరళ వరద బాధితులకి భారీ సహాయం ఇంతకీ ఎవరితను? మీరే చూడండి. | Malayali NRI Billionaire to Donate Rs 50 Crore

The state has been suffering from abnormally high rains
Story first published: Tuesday, August 21, 2018, 16:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X