For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ కు పోటీగా దిగనున్న రిలయన్స్ జియో

By Sabari
|

ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రిటైల్‌తో జట్టుకట్టేందుకు చైనా ఇ-కామర్స్‌, రిటైల్‌ దిగ్గజం ఆలీబాబా గ్రూప్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

రిలయన్స్‌

రిలయన్స్‌

రిలయన్స్‌ రిటైల్‌తో కలిసి మెగా జాయింట్‌ వెంచర్‌(జెవి)ను ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ జెవిలో ఆలీబాబా గ్రూపు 500 కోట్ల డాలర్ల (రూ.35,000 కోట్లు) మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.

 ఆలీబాబా

ఆలీబాబా

ఒకవేళ ఇరు వర్గాల ఒప్పందం కుదిరితే, ఆలీబాబాకు ఇండియన్‌ మార్కెట్లో ఇదే అతిపెద్ద ఇన్వె్‌స్టమెంట్‌ కానుంది. భారత ఇ-కామర్స్‌ మార్కెట్లో అగ్రగామి సంస్థలుగా ఉన్న ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు గట్టిపోటీ ఇచ్చే ఉద్దేశంతోనే ఈ జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసే దిశగా ఇరు వర్గాలు ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది

ముకేష్‌ అంబానీ

ముకేష్‌ అంబానీ

గ్రూపు రిటైల్‌ వ్యాపారాలను సరికొత్త శిఖరాలకు చేర్చాలనుకుంటున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేష్‌ అంబానీ ఈమధ్య ప్రకటించారు. ఆలీబాబా- రిలయన్స్‌ కలిసి అడుగుపెడితే మాత్రం దేశీయ ఇ-కామర్స్‌ మార్కెట్లో పోటీ మరింత తీవ్రం అవుతుందని, వినియోగదారులకు మరింత చౌక ఆఫర్లు లభించే అవకాశం ఉంటుందని విశ్లేషకులంటున్నారు.

ఆలీబాబా దృష్టి

ఆలీబాబా దృష్టి

అంతర్జాతీయ ఇ-కామర్స్‌ దిగ్గజాల దృష్టంతా భారత మార్కెట్‌ పైనే. దేశంలో ఇ-కామర్స్‌తోపాటు రిటైల్‌ వ్యాపారాలపై ప్రధానంగా కన్నేశాయి. అసలుకైతే, ఆలీబాబా రిలయన్స్‌ రిటైల్‌లో దాదాపు సగం వాటా కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందని, తాజాగా జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు దిశగా చర్చలు సాగుతున్న నేపథ్యంలో స్వల్ప వాటా దక్కవచ్చని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వ్యక్తులు తెలిపారు.

Read more about: jio
English summary

ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ కు పోటీగా దిగనున్న రిలయన్స్ జియో | Jio Ready to Tie Up With Alibaba

China e-commerce and retail giant Alibaba Group Holding Ltd has been keen to team up with Mukesh Ambani-based Reliance retail.
Story first published: Tuesday, August 21, 2018, 11:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X