For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దంచి కొట్టిన దేశీయ స్టాక్ మార్కెట్

By Sabari
|

సోమవారం మార్కెట్లు స‌రికొత్త రికార్డుల‌ను నమోదుచేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ లాభాలను గడించి ఆల్‌టైమ్ హై స్థాయికి చేరింది. నిఫ్టీ కూడా 11,500 పాయింట్లు అధిగమించి కొత్త ఆల్‌ టైం హైని టచ్‌ చేసింది. ఉదయం నుంచే లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదేజోరును కొనసాగించాయి. ఫలితంగా సూచీలు కొత్త రికార్డులను నమోదుచేశాయి. రూపాయి బలపడటం; బ్యాంకింగ్, ఇతర రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్లకు కలిసొచ్చిందని చెప్పవచ్చు.

దంచి కొట్టిన దేశీయ స్టాక్ మార్కెట్

ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 330.87 పాయింట్ల లాభంతో 38,278.75 వద్ద ముగిసింది. నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 11,551.75 వద్ద ముగిసింది. ఒకదశలో సెన్సెక్స్ 38,340.69 పాయింట్ల ఆల్‌టైమ్ హై స్థాయికి చేరగా... నిఫ్టీ కూడా 11,565.30 పాయింట్ల ఆల్‌టైమ్ రికార్డుకు చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.80 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలో పెరుగదల కనిపించింది. బంగారం ధర 108 పాయింట్ల లాభంతో 29,457 వద్ద కొనసాగుతోంది.

ఎల్‌ అండ్‌ టీ, దివిస్ ల్యాబోరేటరీస్, టాటా మోటార్స్, టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఓఎన్‌ జీసీ, టాటా స్టీల్, హిందాల్కో షేర్లు మూడు శాతంపైగా లాభాలతో ముగిశాయి. ఇన్ఫోసిస్, గెయిల్ షేర్లు అధిక నష్టాలతో ముగియగా.. టైటాన్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, లుపిన్ షేర్లు నష్టపోయాయి. హెచ్‌ సీసీ రికార్డు స్థాయిలో ఇవాళ 20 శాతం పెరిగి రూ. 15.40 వద్ద ముగిసింది.

Read more about: stock market
English summary

దంచి కొట్టిన దేశీయ స్టాక్ మార్కెట్ | Today Stock Market Ends With Profits

Markets recorded new records Monday. With good signals of international markets, the Sensex tripled the triple century and reached the all-time high.
Story first published: Monday, August 20, 2018, 17:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X