అవసరాల బట్టి అప్పు తీసుకోవడం జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. తీసుకున్న అప్పును ఒకేసారి చెల్లించలేం కదా! ఆ అప్పును నెలసరి సులభ వాయిదాల్లో తీర్చే వెసులుబాటే వాయిదా పద్ధతి(ఈఎంఐ).

శక్తికి మించి
దీనివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ శక్తికి మించి అప్పులు చేసి, ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నవారు చాలామందే ఉన్నారు. ఖర్చులను, కోరికలను వాయిదా వేయడానికి బదులు, వాటికి వాయిదాల్లో సొమ్ము చెల్లించేందుకు సిద్ధపడితే మన ఆర్థికాభివృద్ధికి ముప్పు తప్పదు. అందుకే అప్పుల విషయంలోనూ, నెలవారీ వాయిదాల (ఈఎంఐ) విషయంలోనూ కాస్త ఆచితూచి వ్యవహరించాలి.

ఏవి మంచి అప్పులు, ఏవి చెడ్డ అప్పులు తెలుసుకోవడమెలా?
చెల్లించేది ఈఎంఐ రూపంలోనే కదా.. అంత కష్టమేముంది?! అనుకుంటే అప్పులో కాలేసినట్లే. సంపాదించిన మొత్తం బాకీల చెల్లింపునకే సరిపోతుంటే ఇల్లు గడవడం, భవిష్యత్ ఆర్థికభద్రత ఎలా అన్నది మర్చిపోకూడదు.

పెద్దమొత్తంలో అప్పు
వ్యాపారానికైనా, ఇంటి కొనుగోలుకైనా మీ శక్తిసామర్థ్యాలకు మించి రుణం తీసుకుంటే మంచి అప్పుల్లోనూ కాస్త చెడు ఉన్నట్లే. అంటే వ్యాపారం మొదలుపెట్టేందుకు, లేదా విస్తరించేందుకు రుణం తీసుకోవడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇది మంచి రుణమే. అలాగే ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఒక సొంత ఇల్లు కొనుగోలు చేయడం మంచిదే. అయితే స్థోమతకు మించి పెద్ద ఇల్లు కొనుగోలుకు పెద్దమొత్తంలో అప్పు తీసుకున్నా అది చెడ్డరుణం కిందే వస్తుంది.

ఉదాహరణకు
మీ నెల జీతం 25 వేల రూపాయలు అనుకుందాం. నెలకు 10 వేల రూపాయలకు మించి ఈఎంఐ లేకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈఎంఐ 50 శాతానికి చేరినా ఇబ్బందిలేదు. కానీ, అంతకన్నా ఎక్కువైతే జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆర్థిక సమస్యలు తప్పవు.

ఆర్భాటాలకు పోవద్దు
సమాజంలో గుర్తింపు, చుట్టుపక్కల వారికంటే ఉన్నతస్థాయిలో ఉండాలను కోవడంలో తప్పులేదు. అందుకోసం కష్టపడాలి. అంతేగానీ స్థోమతకు మించి ఆర్భాటాలకు పోవడం ప్రమాదం. ఒక వాహనాన్ని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు మీ అవసరం, స్థోమత ఉన్న మేరకే తీసుకోవాలి.

ఉదాహరణకు
మీరు ఐదు లక్షల రూపాయలు రుణం తీసుకొని, ఐదేళ్ళలో ఆ అప్పు తీర్చేందుకు సిద్ధపడితే, కచ్చితంగా దానికి మీరు కట్టుబడి ఉండాలి. అంతేకానీ, ఒకటి రెండేళ్ళ వ్యవధి పెరుగుతుంది, అంతేకదా అని అధిక రుణం జోలికి వెళ్ళకండి. వ్యవధి పెంచుకుని తక్కువ మొత్తంలో ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది కదా అని చాలామంది భావిస్తారు. కానీ అది కూడా పొరపాటు. వ్యవధి పెరిగితే వాయిదా మొత్తం తగ్గడం నిజమే! కానీ, వడ్డీ మాటేమిటి? వ్యవధి పెరిగే కొలదీ మీరు చెల్లించే వడ్డీ కూడా పెరుగుతుందని మర్చిపోకూడదు
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications