For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెర మీదనే కాదు రియల్ లైఫ్లో కూడా హీరోలు అనిపించుకున్న మన వాళ్ళు కేరళకు భారీ సహాయం.

By Sabari
|

ప్రకృతి ప్రకోపంతో వణికిపోతున్న కేరళ రాష్ట్రానికి అండగా నిలిచేందుకు దేశం మొత్తం నిలిచింది. కేరళ రాష్ట్రాన్ని ఆదుకొనేందుకు వివిధ రాష్ట్రాలతో పాటు మన హీరోలు కూడా ముందుకొచ్చారు.

అగమ్యగోచరంగా

అగమ్యగోచరంగా

వరదల కారణంగా కేరళ ప్రజల జీవితం అగమ్యగోచరంగా మారింది దేనికి మన దేశమంతా కోట్ల రూపాయల విరాళాలతో కేరళ ప్రజలకి అండగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు ఏఏ హీరో ఎంత ఇచ్చారు ఏఏ ప్రభుత్వం ఎంత ఇచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం!

తెలుగులు రాష్ట్రాలు

తెలుగులు రాష్ట్రాలు

కేరళ వరద బాధిత సహాయార్ధం తెలంగాణలోని టిఆర్ఎస్ పార్టీ రూ.27 కోట్లు ఇవ్వగా అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.10 కోట్లు ఇచ్చింది.అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపత్తు నిర్వహణ బృందాలను కేరళకు పంపించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం మంచి నీరు తయారు చేసే యంత్రాలని పంపింది.ఇక ఆంధ్రప్రదేశ్ లో మరో పార్టీ వైఎస్అర్ పార్టీ అధినేత తన పార్టీ తరపున రూ.1 కోటి రూపాయిలు విరాళం ఇచ్చారు.

మిగతా రాష్ట్రాల సహాయం

మిగతా రాష్ట్రాల సహాయం

కర్ణాటక లోని జేడీఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రూ. 10 కోట్లు మరియు తమిళనాడు ప్రభుత్వం రూ.5 కోట్లు అందచేసింది. ఇక కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం రూ.10 కోట్లు మరియు బీహార్ ప్రభుత్వం రూ.10 కోట్ల రూపాయిలు మరియు జార్ఖండ్ ప్రభుత్వం రూ.5 కోట్లు, పంజాబ్ ప్రభుత్వం రూ.10 కోట్ల రూ.రూపాయిలు అందించారు.

దక్షిణాది హీరోలు

దక్షిణాది హీరోలు

ఇక దక్షిణాది హీరోలు మరియు నటులు కూడా కేరళకు జరిగిన నష్టంకు ఆవేదన వ్యక్తం చేస్తూ తమ ఔదార్యాన్ని ప్రదర్శించారు. సహాయ, రక్షణ మరియు పునరావాస కారిక్రమాలలో తమ అభిమానులను పాల్గొనాలి అని కోరుతూ తమ విరాళాలని ప్రకటించారు.

తమిళ్ ఇండస్ట్రీ

తమిళ్ ఇండస్ట్రీ

తమిళనాడు ఇళయదళపతి విజయ్ కుమార్ కేరళ వరద బాధితులకోసం రూ.14 కోట్లు విరాళం ప్రకటించాడు. సన్నీలియోన్ రూ.5 కోట్ల రూపాయిలు ప్రకటించింది అలాగే తమిళ్ స్టార్ హీరోలు కమల్ హాస్సన్, సూర్య , కార్తీ మరియు విజయసేతుపతి ఒక్కొక్కరి చెప్పున రూ.25 లక్షలు ప్రకటించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ రూ.10 లక్షల రూపాయిలు మరియు సూర్య ప్రత్యేకంగా అమ్మ ఫండ్ కు రూ.10 లక్షలు విరాళం అందించారు.

హీరో సిద్దార్థ్

హీరో సిద్దార్థ్

హీరో సిద్దార్థ్ రూ.10 లక్షలు విరాళం ప్రకటించడమే కాకుండా విరాళాల సేకరణకు సోషల్ మీడియా ఛాలెంజ్ ప్రారంభించాడు. ధనుష్ రూ.15 లక్షల రూపాయిలు, విశాల్ రూ.10 లక్షలు మరియు శివకార్తికేయన్ రూ.10 లక్షలు ఉదయనిధి స్టాలిన్ రూ.10 లక్షలు ప్రకటించారు. ఇక తమిళనాడు ఫేమస్ ఛానల్ సన్ టీవీ రూ.1 కోటి రూపాయిలు విరాళం ప్రకటించింది.

మళయాళ ఇండస్ట్రీ

మళయాళ ఇండస్ట్రీ

సాయి పల్లవి రూ.35 లక్షలు , మోహన్ లాల్ రూ. 25 లక్షలు , మమ్ముటి రూ.25 లక్షలు అలాగే మలయాళ ఫిలిమ్ అసోసియేషన్ రూ.50 లక్షల రూపాయిలు విరాళం ప్రకటించింది. అలాగే దుల్కర్ సల్మాన్ రూ.25 లక్షల రూపాయిలు మరియు నయనతార రూ.10 లక్షల రూపాయిలు, అనుపమ పరమేశ్వరన్ రూ.1 లక్ష మరియు నటి రోహిణి రూ.2 లక్షలు ప్రకటించారు.

మెగా ఫ్యామిలీ

మెగా ఫ్యామిలీ

ఇక తెలుగు హీరోలు కూడా కేరళ ప్రజలు పడుతున్న బాధను చూసి చెలించిపోయారు, దీంతో విరాళాలు అందచేసారు.కాగా మెగా కుటుంబం నుంచి చిరంజీవి రూ.25 లక్షల రూపాయిలు, అయన తల్లి అంజలి దేవి రూ.1 లక్ష రూపాయిలు ,అయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూ.2 కోట్లు విరాళంగా ఇవ్వగా అయన కొడుకు రాంచరణ్ రూ.25 లక్షల రూపాయిలు అయన కోడలు ఉపాసన తన వంతు సహాయంగా ఒక రూ.10 లక్షలు విలువ చేసే మందులు కేరళకు పంపింది .

అల్లు అర్జున్

అల్లు అర్జున్

ఇక అల్లు అర్జున్ కేరళలో ఈయనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ ఈయనని మల్లు అర్జున్ అని పిలుస్తారు. కేరళ వరదలు చూసి అయన చెల్లించిపోయి రూ.25 లక్షలు విరాళం కేరళ వరద సహాయ నిధికి అందచేశారు.

తెలుగు ఇండస్ట్రీ

తెలుగు ఇండస్ట్రీ

అలాగే నిర్మాత బన్నీ వాసు గీత గోవిందం కేరళ వసూలు అన్ని కేరళ వరద సహాయ నిధికి రాసిచ్చారు. ఇక జూనియర్ ఎన్టిఅర్ రూ.25 లక్షలు, ప్రభాస్ రూ.25 లక్షల రూపాయిలు, మహేష్ బాబు రూ.25 లక్షలు, నందమూరి కళ్యాణ్ రామ్ రూ. 10 లక్షల రూపాయిలు ఇవ్వగా.

విజయదేవరకొండ

విజయదేవరకొండ

వారితో పాటు అక్కినేని దంపతులు నాగార్జున మరియు అమల తమవంతు సహాయంగా రూ.28 లక్షలు ఇచ్చారు. వీరితో పాటు విజయదేవరకొండ , రామ్ పోతినేని, డైరెక్టర్ కొరటాల శివ ఒక్కొక్కరు రూ.5 లక్షలు ప్రకటించారు.

 కేరళలో

కేరళలో

ఇది ఎలా ఉంటే గత వందేళ్లుగా కేరళలో ఎప్పుడూ లేని విధంగా వరదలు ఈ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 300 మంది మరణించగా సుమారు రెండు లక్షల మంది నిరాశ్రులు అయ్యారు .

విపత్తు బృందం

విపత్తు బృందం

కేరళలో ఇప్పుడు ఎక్కడ చుసిన కూలిపోయిన ఇల్లు మరియు ద్వాంసమైన రోడ్లు కనిపిస్తున్నాయి. అలాగే జాతీయ విపత్తు బృందం రంగంలోకి దిగి హుటాహుటిన సహాయక చర్యలు చేపడుతోంది.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఇకపోతే వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రాన్ని స్వయంగా చుసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్రం తరపున నుంచి రూ.500 కోట్లు ఇచ్చారు. కానీ కేంద్రం నుంచి వచ్చిన రూ.500 కోట్లు సరిపోవు అని తమకి ఇంకా సహాయం కావాలి అని కేరళ ప్రభుత్వం కోరింది. కాగా వరదలలో చనిపోయినవారి రూ.2 లక్షల రూపాయిలు మరియు వరదలో గాయపడినవారికి రూ.50 వేలు సహాయం ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

Read more about: funds
English summary

తెర మీదనే కాదు రియల్ లైఫ్లో కూడా హీరోలు అనిపించుకున్న మన వాళ్ళు కేరళకు భారీ సహాయం. | Reel Life to Real Life Heros Huge Help to Kerala Floods

The whole country has been able to stand up to the shaky state of Kerala. Our heroes have also come forward with different states to take up the state of Kerala.
Story first published: Monday, August 20, 2018, 13:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X