For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక పై రాత్రి 9 దాటితే ఏటీఎంలో నో మనీ ఎందుకో తెలుసా?

By Sabari
|

ఏటీఎంలో చోరీలు, నగదు వ్యాన్ల‌పై దాడుల ఘటనలను నియంత్రించే దిశగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి పట్టణ ప్రాంతాల్లోని ఏటీఎంలలో రాత్రి వేళల్లో 9 గంటల తర్వాత నగదు నింపబోరు.

మావోయిస్టు ప్రభావిత

మావోయిస్టు ప్రభావిత

అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంలలో సాయంత్రం 6 గంటల తర్వాత నగదు నింపకూడదు. ఈ మేరకు అన్ని బ్యాంకులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ కటాఫ్ సమయాన్ని సాయంత్రం 4 గం.లుగా నిర్ణయించారు. అలాగే నగదును వ్యానులో ఏటీఎంకు తరలించే సమయంలో ఇద్దరు సాయుధ గార్డులు కూడా తప్పనిసరిగా ఉండాల్సిందే.

వాహనాల్లో

వాహనాల్లో

కొత్త మార్గదర్శకాల మేరకు ఏటీఎంలలో నగదు నింపే ప్రైవేటు ఏజెన్సీలు బ్యాంకుల నుంచి మధ్యాహ్నానికి ముందే నగదును తీసుకోవాల్సి ఉంటుంది. ఏటీఎంకు నగదును తరలించే వాహనాల్లో సాయుధ గార్డులు తప్పనిసరిగా ఉండాలి.

సెక్యూరిటీ గార్డులు

సెక్యూరిటీ గార్డులు

వాహనంలో నగదు తరలిస్తున్న సమయంలో ఒకరు వాహన డ్రైవర్‌తోనూ మరొకరు వాహనం వెనుక కూర్చోవాలి. నగదును వాహనంలోకి ఎక్కిస్తున్న సమయంలోనూ వాహనంలో నుంచి దింపుతున్న సమయం, టీ లేదా మధ్యాహ్న భోజనం కోసం వెళ్లే సమయంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కలిసి వెళ్లడానికి లేదు.

ఒక ట్రిప్‌లో

ఒక ట్రిప్‌లో

ఒక్క సెక్యూరిటీ గార్డు తప్పనిసరిగా నగదు వాహనంతో ఉండాల్సిందే. వీలైనంత వరకు మాజీ సైనికులను సెక్యూరిటీ గార్డుగా నియమించుకోవాలి. నగదును ఏటీఎంకు తరలించే వాహనంలో జీపీఎస్ ట్రాకింగ్ డివైస్ కూడా తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఒక ట్రిప్‌లో వాహనంలో రూ.5 కోట్లకు మించి తరలించడానికి వీలులేదు.

 బ్యాంకులు

బ్యాంకులు

ఈ కొత్త మార్గదర్శకాలు 2019 ఫిబ్రవరి 8 నుంచి అమలులోకి రానున్నాయి. దేశంలో ఏదో ఒకచోట నిత్యం నగదు వాహనాలపై దాడులు, ఏటీఎం నేరాలు, అంతర్గత నేరాలు చోటుచేసుకుంటుండడంతో దీన్ని నివారించే నిమిత్తం కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకుంది. ఈ కొత్త మార్గదర్శకాలను బ్యాంకులు తప్పనిసరిగా పాటించాల్సిందేనని కేంద్ర హోం శాఖ స్పష్టంచేసింది.

Read more about: money
English summary

ఇక పై రాత్రి 9 దాటితే ఏటీఎంలో నో మనీ ఎందుకో తెలుసా? | No Money Loaded After 9 pm in Atm's

The Union Home Ministry has made crucial decisions to control the incidents of attacks on cash and cash vans in ATM. From next year, ATMs in urban areas will not be lumped at 9 o'clock in the night.
Story first published: Monday, August 20, 2018, 10:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X