మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భాగస్వామిగా ఉన్న టర్బో మేఘా ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ భారీస్థాయిలో విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

7 కొత్త విమానాలతో
మార్చి 2019 నాటికి 7 కొత్త విమానాలతో 20 ప్రాంతాలకు తమ ట్రూజెట్ బ్రాండ్ విమానాలను నడపాలని యాజమాన్యం భావిస్తోంది. ఇందుకోసం అప్పుల్లో కూరుకుపోతున్న జెట్ ఎయిర్ వేస్ తో చర్చలు కూడా ప్రారంభించింది. ఈ నెలలోనే ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

జెట్ ఎయిర్ వేస్
జెట్ ఎయిర్ వేస్ తో ఒప్పందం కుదిరితే 7 ఏటీఆర్ విమానాలు ట్రూజెట్ ఫ్లీట్ లో చేరతాయి. ఈ ఒప్పందం ఐదేళ్ల పాటు అమలులో ఉంటుంది. 7 ఏటీఆర్ విమానాలతో పాటు సిబ్బంది, నిర్వహణ, ఇన్సూరెన్స్ లను కూడా సబ్ లీజుకి తీసుకొనే ఉద్దేశంలో ఉన్నట్టు తెలిసింది.

ట్రూజెట్ జెట్
ఈ 7 విమానాలతో మెరుగైన ఫలితాలు సాధిస్తే ట్రూజెట్ జెట్ ఎయిర్ వేస్ నుంచి మరిన్ని విమానాలను సబ్ లీజుకి తీసుకొనే అవకాశం ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం
జూలై 2015న ట్రూజెట్ తన కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం 5 ఏటీఆర్-72 విమానాలతో 14 ప్రాంతాలకు విమానాలు నడుపుతోంది.

తన కార్యకలాపాలు
టైర్ 2, టైర్ 3 నగరాలను కలుపుతూ చౌకగా విమానయానం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కింద ట్రూజెట్ తన కార్యకలాపాలు సాగిస్తోంది. విస్తరణ అనంతరం పశ్చిమ మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలకు విమానాలు నడిపే యోచనలో ఉంది ట్రూజెట్.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications