For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా? అయితే మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

By Sabari
|

బ్యాంకులో సేవింగ్స్‌, కరెంట్‌ అకౌంట్‌లు నిర్వహిస్తున్నప్పుడు.. కచ్చితంగా కొన్ని సాంకేతికమైన అంశాలపై ఖాతాదారులు కచ్చితంగా దృష్టి సారించాలి. రోజురోజుకీ బ్యాంకింగ్‌ రంగంలో డిజిటల్‌ మార్పులు అనివార్యమవుతున్న తరుణంలో ఖాతాదారులు కొన్ని విషయాలపై అప్రమత్తంగా ఉండాలి.

 మొబైల్‌ నంబర్‌

మొబైల్‌ నంబర్‌

బ్యాంకు ఖాతా తెరిచేటప్పుడు మన మొబైల్‌ నంబర్‌ మాత్రమే ఇవ్వాలి. మొబైల్‌ లేకుంటే ఇవ్వకూడదు. ఎవరో ఒకరి మొబైల్‌ నంబర్‌ ఇచ్చినట్టయితే మన లావాదేవీలన్నీ వారికి తెలిసే అవకాశం ఉంటుంది. పర్యావసానాలు ఉహించగలరు కదా..!

అడ్రస్‌

అడ్రస్‌

మన అడ్రస్‌ మారినప్పుడు తప్పనిసరిగా బ్యాంకుకు తెలియజేయాలి. లేకుంటే బ్యాంకు ఏ విషయమైనా మనకు తెలియజేయాలనుకున్నా సాధ్యం కాదు. ఉదాహరణకు మనం వేసిన చెక్కు తిరిగి వచ్చినా మనకు తెలియజేయలేరు. పర్యావసానానికి మనమే బాధ్యులం అవుతాం.

 ఖాతాలో

ఖాతాలో

మన ఖాతాలో ఇతరుల సొమ్ము జమ చేసుకోకపోవడం ఉత్తమం. పరోపకారం అనుకుని తీసుకుంటే కష్టాలు తప్పవు.

ఎటిఎం కార్డు

ఎటిఎం కార్డు

ఎటిఎం కార్డుతోపాటు పిన్‌ పెట్టుకోకూడదు. పిన్‌ ఎవ్వరికీ తెలియకుండా ఉంచుకోవడం మంచిది. కార్డు నెంబరును గాని, పిన్‌ నంబరును గాని ఎవరికీ ఇవ్వవలసిన అవసరం ఉండదు. ఎవరైనా అడిగితే ఇవ్వమని కచ్చితంగా చెప్పాలి. పిన్‌ ఇవ్వడం అంటే తాళం ఇచ్చినట్లే.

డూప్లికేట్‌ కార్డులు

డూప్లికేట్‌ కార్డులు

ఎటియం సెంటర్‌లో కార్డు వివరాలు సేకరించే పరికరాలు ఉన్నాయా అని గమనించాలి. కొంతమంది కొన్ని పరికరాలు అమర్చి కార్డు వివరాలు సేకరించి, డూప్లికేట్‌ కార్డులు రూపొందించే ప్రమాదం ఉంది.

ఐదుసార్లు

ఐదుసార్లు

వీలైనంత వరకు మన బ్యాంకు ఎటిఎంలో డబ్బులు తీసుకోవడం ఉత్తమం. ఛార్జీలు పడవు. వేరే బ్యాంకు ఎటిఎంలు ఐదుసార్లు అంతకంటే ఎక్కువసార్లు వాడితే ఛార్జీలు పడతాయి. ఈ ఐదుసార్లలో అకౌంట్‌లో నిల్వ చూసుకోవడం కూడా కలుస్తుంది.

నెట్‌ బ్యాంకిగ్‌ను

నెట్‌ బ్యాంకిగ్‌ను

నెట్‌ బ్యాంకిగ్‌ను నెట్‌ సెంటర్‌లలో వాడకూడదు. ఈ రోజు మన సొమ్ము బ్యాంకులో దాచుకున్న దానిని భద్రంగా కాపాడుకునే బాధ్యత మనదే కాబట్టి.. మన కార్డు మన పాస్‌వర్డ్‌ మన చెయ్యి జారకూడదు

బ్యాంకు సేవలో

బ్యాంకు సేవలో

బ్యాంకు సేవలో లోపాలు అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

మన రూపాయి అంటే మన శ్రమ. మనం దాచుకున్న శ్రమను ఎవరూ దోచుకోకుండా మనమే మెలకువగా ఉండాలి.

Read more about: savings account
English summary

మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా? అయితే మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా? | People Who Are Having Saving Accounts Need to Follow These Rules

Customers should definitely focus on certain technical issues when maintaining savings and current accounts in the bank
Story first published: Saturday, August 18, 2018, 14:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X