For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేంద్రం నుంచి కేరళకి రూ.500 కోట్లు సహాయం మోడీ ఏరియల్ సర్వే.

By Sabari
|

గత పది రోజులుగా భారీ వర్షాల ధాటికి చిగురుటాకులా వణికిపోతున్న కేరళలో ప్రధాని మోదీ శనివారం పర్యటించారు. పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్న దక్షిణాది రాష్ట్రంలో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు.

తిరువనంతపురం

తిరువనంతపురం

ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తిరువనంతపురం చేరుకున్న ప్రధాని కేరళ సీఎం, అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు

మోదీతోపాటు

మోదీతోపాటు

ప్రధాని మోదీతోపాటు కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ సదాశివం, పర్యాటక మంత్రి కేజే ఆల్ఫోన్స్‌ ఏరియల్ సర్వేలో ప్రధానితోపాటు పాల్గొన్నారు.

తక్షణ సాయంగా

తక్షణ సాయంగా

కేరళ పరిస్థితి చూసి చలించిపోయిన ప్రధాని తక్షణ సాయంగా రూ.500 కోట్లు ప్రకటించారు. వరదలు, వర్షాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం చెల్లిస్తామని ప్రధాన మోదీ తెలిపారు.

పీఎం రిలీఫ్ ఫండ్

పీఎం రిలీఫ్ ఫండ్

తీవ్రంగా గాయపడిన వారికి పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.50 వేలు ఆర్థిక సాయం చేస్తామని మోదీ ప్రకటించారు. ఇప్పటికే హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేరళలో ఎరియల్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయన రూ.100 కోట్ల మేర తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు.

 రూ.20 వేల కోట్ల నష్టం

రూ.20 వేల కోట్ల నష్టం

వరద బీభత్సంతో రాష్ట్రానికి సుమారు రూ.20 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణమే రూ.2 వేల కోట్లు విడుదల చేయాలని కేరళ సర్కారు ప్రధాని మోదీని కోరింది. దీంతో అక్కడి పరిస్థితిని స్వయంగా తెలుసుకోవడం కోసం ప్రధాని కేరళ వెళ్లారు.

తోటి రాష్ట్రాలు

తోటి రాష్ట్రాలు

కేరళను ఆదుకోవడానికి తోటి రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. తెలంగాణ సర్కారు రూ.25 కోట్ల విరాళం ప్రకటించగా.. ఆంధ్ర ప్రదేశ్ రూ.10 కోట్లు సాయంగా ప్రకటించింది.

బాలమృతం

బాలమృతం

నీటిని శుద్ది చేసేందుకు రూ.2.5 కోట్ల విలువైన ఆర్వో మెషీన్లను కేసీఆర్ సర్కారు కేరళకు పంపుతోంది. చిన్న పిల్లల కోసం రూ.55 లక్షల విలువైన ‘బాలమృతం'ను కూడా బేగంపేట నుంచి కేరళ పంపారు.

Read more about: modi
English summary

కేంద్రం నుంచి కేరళకి రూ.500 కోట్లు సహాయం మోడీ ఏరియల్ సర్వే. | Central Government Announce 500 Crores to Kerala

Prime Minister Narendra Modi on Saturday visited Kerala in the wake of heavy rains over the past 10 days. He conducted aerial survey in the southern state of which was completely flooded with water.
Story first published: Saturday, August 18, 2018, 11:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X