For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాజ్‌పేయీ గారి వల్లే ఈరోజు అంత ఇండియాలో స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు అంటా తెలుసా?

By Sabari
|

ఈ కాలంలో స్మార్ట్‌ఫోన్‌లు వాడని వారు చాలా అరుదుగా కనపడతారు. అవి మన జీవితంలో ఎంతగా భాగమయిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్‌-3 స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లలో భారత్ ఒకటిగా‌ ఉంది.

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ

భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లు ఇంతగా వాడకంలోకి రావడానికి కారణం ఆ నాడు మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రవేశపెట్టిన టెలికాం విధానమే. 1995లో పీవీ నరసింహారావు భారత ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో మొట్టమొదటి సారి మొబైల్‌ ఫోన్లు వాడుకలోకి వచ్చాయి

వీపీ నరసింహారావు

వీపీ నరసింహారావు

ఆ సమయంలో దేశంలో మొదటి మొబైల్‌ ఫోన్‌ కాల్‌ను నాటి పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి జ్యోతి బసుకి టెలికాం శాఖ మంత్రి సుఖ్‌ రామ్‌ చేశారు. అయితే, మొబైల్‌ టెలికమ్యూనికేషన్‌ల కోసం వీపీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో భారత్‌లో టెలికాం విధానాన్ని ప్రవేశపెట్టలేదు

 టెలికాం రంగంలో

టెలికాం రంగంలో

అనంతరం వాజ్‌పేయీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక భారత్‌లో టెలికాం రంగంలో సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర మంత్రి ప్రమోద్‌ మహాజన్‌కు సూచించారు.

ప్రైవేట్ సంస్థలకు

ప్రైవేట్ సంస్థలకు

దీంతో ఆ రంగంలో భారత్‌లో ప్రైవేట్ సంస్థలకు గొప్ప అవకాశాలు కల్పిస్తూ టెలికాం విధానాన్ని ప్రవేశ పెట్టారు. టెలికాం బిల్లులకు ప్రభుత్వమే నిర్ణీత ఛార్జీలను విధించే విధానాన్ని రద్దు చేశారు

మొబైల్‌ ఫోన్‌ల తయారీ

మొబైల్‌ ఫోన్‌ల తయారీ

దేశంలో టెలికాం రంగ సేవల్లో నాణ్యత మరింత పెరిగింది. వాజ్‌పేయీ ప్రవేశపెట్టిన టెలికాం పాలసీ, తరువాతి కాలంలోనూ ఆయన తీసుకున్న నిర్ణయాల ద్వారా దేశంలో మొబైల్‌ ఫోన్‌ల తయారీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందింది.

2004లో

2004లో

2004లో వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలోనే దేశంలో ల్యాండ్‌లైన్‌ ఫోన్ల సంఖ్యను మొబైల్‌ ఫోన్లు అధిగమించాయి. ప్రపంచం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో భారత్‌ వచ్చే ఏడాది టాప్-2లో ఉంటుందని అంచనా.

భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లు

సామాన్యుడు సైతం మొబైల్‌ ఫోన్లు వాడేలా తన హయాంలో వాజ్‌పేయీ తీసుకున్న నిర్ణయాలే నేడు భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లు ఇంతగా వాడకంలో ఉండడానికి దోహదం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Read more about: business
English summary

వాజ్‌పేయీ గారి వల్లే ఈరోజు అంత ఇండియాలో స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు అంటా తెలుసా? | Vajpayee Introduced The Telecom Process in India

They rarely appear to be smartphones in this period. There is no need to specifically say how much they have become part of our lives. India is currently one of the world's top 3 smartphone markets.
Story first published: Friday, August 17, 2018, 16:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X