For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆపదలో ఆదుకొనే మంత్లీ సేవింగ్స్ మీకోసం చూడండి.

By Sabari
|

సంపాదన తక్కువైనా, ఎక్కువైనా, ఆర్జించే దానికంటే ఖర్చులు మించిపోతున్నాగానీ ఎంతోకొంత పొదుపు చెయ్యాలనేది ప్రాథమిక పొదుపు సూత్రం. చిన్నమొత్తాలతో పొదుపు ప్రారంభించడం అలవాటు చేసుకుంటే, సంపాదన పెరిగాక పెద్దమొత్తంలో పొదుపు చేసుకోవచ్చు. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా.. కనీస మొత్తంలో పొదుపు చేయడం అన్నివిధాలా మేలన్నది నిపుణుల మాట. అలా చిన్న చిన్నగా పొదుపు ప్రారంభించడానికి అనువైన పథకం రికరింగ్‌ డిపాజిట్‌.

రికరింగ్‌ డిపాజిట్‌ అంటే?

రికరింగ్‌ డిపాజిట్‌ అంటే?

బ్యాంకింగ్‌ సంస్థల పదజాలం ప్రకారం రికరింగ్‌ డిపాజిట్స్‌ అంటే, నెలవారీగా నిర్దేశించిన కొంతమొత్తాన్ని బ్యాంకింగ్‌ రంగాలతో కలిసి ప్రత్యేక అకౌంట్‌ ద్వారా డిపాజిట్‌ చేస్తూ.. కొంతకాలం తర్వాత అదనపు వడ్డీతో కలిపి, మదుపు చేసిన సొమ్మును తిరిగి తీసుకోవడం. కనీసం ఆరునెలలు, ఏడాది కాలం వ్యవధి నుంచి మొదలై ఐదేళ్ళు, పదేళ్ళ కాలంపాటు ఆర్డీ పథకాలు కొనసాగించుకోవచ్చు.

ఎలా ప్రారంభించాలి?

ఎలా ప్రారంభించాలి?

కనీసం రూ.100 పెట్టుబడితో ఆర్డీ అకౌంట్‌ ప్రారంభించవచ్చు. దాదాపు అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రికరింగ్‌ డిపాజిట్లను పెద్దఎత్తున ప్రొత్సహిస్తున్నాయి. సాధారణ అకౌంట్‌ తెరిచే పద్ధతుల్లోనే ఆర్డీ ఖాతాను ఎవ్వరైనా తెరవొచ్చు. మైనర్లయితే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పర్యవేక్షణలో ఆర్డీ ఖాతా నిర్వహించుకోవచ్చు. మైనారటీ తీరిన తర్వాత వారే అకౌంట్‌ హక్కుదారులు అవుతారు. నామినీ సౌకర్యం ఉంటుంది. ఆర్డీల్లో మదుపు చేయడానికి గరిష్టం పరిమితి లేదు. అయితే గత ఏడాది అమలులోకి వచ్చిన పన్ను మినహాయింపు చట్టం (టీడిఎస్‌) సెక్షన్‌ 194-ఏ వర్తిస్తుంది. రికరింగ్‌ డిపాజిట్లపై రూ.10 వేల పైబడి, వడ్డీ తీసుకునే ఖాతాదారులు ఆ వడ్డీలో 10 శాతం టీడిఎస్‌గా చెల్లించాల్సి ఉంటుంది.

వడ్డీ ఎంత?

వడ్డీ ఎంత?

రికరింగ్‌ డిపాజిట్స్‌ విషయంలో ఒక్కొక్క బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీని ఖాతాదారులకు అందజేస్తుంది. అయితే వాటి మధ్య పెద్ద వ్యత్యాసం కనపడదు. సాలీనా 7.40 శాతం నుంచి 7.50, 7.60 మధ్య ఆయా ఆర్థికరంగాల నిర్ణయాలు, ప్రయోజనాల ఆధారంగా రికరింగ్‌ డిపాజిట్లపై వడ్డీశాతం నిర్ణయిస్తాయి

ఎలా చెల్లించాలి?

ఎలా చెల్లించాలి?

ఐదేళ్ళ వ్యవధిగల రికరింగ్‌ పథకాల్లో నెలనెలా నిర్దేశించిన మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఐదేళ్ళపాటు నెలవారీ కంతులు చెల్లిస్తూ ఉండాలి. ఉదాహరణకు నెలకు రూ.100 వంతున చెల్లించే విధంగా ఒప్పందం పెట్టుకుంటే ప్రతినెలా రూ.100 ఆర్డీ ఖాతాలో జమ చేయాలి. ఇలా చెల్లిస్తూ ఉంటే ఏడాదికి రూ.1200 జమ అవుతాయి. ఐదేళ్ళకు మనం చెల్లించిన సొమ్ము రూ.6000 అవుతుంది. సాలీనా వడ్డీ 7.40 లెక్కన వడ్డీ కలుపుకుంటే, రూ.7,270 మొత్తం చేతికి అందుతుంది

షరతులు, నిబంధనలు

షరతులు, నిబంధనలు

రికరింగ్‌ డిపాజిట్‌ అంటేనే నెలవారీగా కొంత సొమ్ము చెల్లించడం. దీన్ని క్రమం తప్పకుండా చెల్లించాలి. అనుకోకుండా ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో ఒకటి రెండు నెలలు చెల్లించపోయినా స్వల్పంగా పెనాల్టీ ఫీజుతో నెలవారీగా జమ చేయాల్సిన సొమ్మును చెల్లించవచ్చు. వరుసగా ఆరు నెలలకు పైబడి చెల్లింపులు నిలిచిపోతే అకౌంట్‌ క్లోజ్‌ అయ్యే ప్రమాదం ఉంది.

రుణం

రుణం

అప్పటిదాకా చెల్లించిన డబ్బులూ కొంత నష్టపోయే అవకాశం ఉంది. అందుకే అలాంటి పరిస్థితి వస్తే నేరుగా సంబంధిత బ్యాంకు, పోస్టాఫీసులో సంప్రదించి, ఖాతా కొనసాగేందుకు అవసరమయ్యే తక్షణ చెల్లింపుపై దృష్టి సారించాలి. ఏడాది దాటిన తర్వాత, అప్పటిదాకా కట్టిన మొత్తంలోంచి 90 శాతం వరకూ లోన్‌ (రుణం)గా తీసుకునే అవకాశం ఉంది.

 నెలనెలా పొదుపు

నెలనెలా పొదుపు

స్వల్ప వడ్డీ చెల్లిస్తూ గడువులోపు తీసుకున్న రుణ మొత్తం చెల్లించవచ్చు. ఆర్డీ ఖాతాలపై నామినీ సౌకర్యం కూడా ఉంది. ఒకేసారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలో పొదుపు చేయలేని వారికి, ఇంచుమించు అంతే ప్రయోజనం కలిగించే రికరింగ్‌ డిపాజిట్స్‌ (ఆర్డీ) పథకాలు అందరికీ అనువైనవి. నెలనెలా పొదుపు అలవాటు జీవితానికి మేలుచేసే చక్కటి మలుపులాంటిదే

Read more about: savings
English summary

ఆపదలో ఆదుకొనే మంత్లీ సేవింగ్స్ మీకోసం చూడండి. | Things to Take Care of in Monthly Saving Schemes

The basic savings formula is to make savings even more than earnings, but less than earnings, more than what they earn. Getting started with savings with a small amount of money can make savings big enough to increase your earnings
Story first published: Friday, August 17, 2018, 10:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X