ఈ ఏడాది బెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ పొందిన సినిమాల్లో ఆరో స్థానంలో నిలుస్తోంది గీతగోవిందం. యూత్‌లో ఫుల్ క్రేజ్‌తో విడుదల అయిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టుకుంది.

భారీ ఓపెనింగ్స్
ముందస్తు అంచనాలతో దీనికి భారీ ఓపెనింగ్స్ సాధ్యం అయ్యాయి. ఎంతలా అంటే.. ఈ ఏడాదిలో తొలి రోజున భారీ కలెక్షన్స్ పొందిన సినిమాల్లో ఆరో స్థానంలో నిలిచేలా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.

5.8 కోట్ల రూపాయల
ఈ సినిమా తొలి రోజున 5.8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించిందని తెలుస్తోంది. దాదాపు 14 కోట్ల రూపాయల ఖర్చుతో రూపొందిన ఈ సినిమాకు ఇవి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ అని వేరే చెప్పనక్కర్లేదు.

షేర్ వసూళ్లను
శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలిపి గీతగోవిందం ఐదు కోట్ల రూపాయల మొత్తాన్ని పలికింది. కేవలం తొమ్మిది కోట్ల రూపాయల షేర్ వసూళ్లను సాధించినా ఈ ప్రాజెక్ట్ సేఫ్ వెంచర్ అవుతుంది. సూపర్ హిట్ దిశగా దూసుకుపోయేలా ఉన్నాయి దీని ఓపెనింగ్స్.

లాభాల పంట
ఎలాగూ పాజిటివ్ టాక్ పొందింది కాబట్టి వీకెండ్‌లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టుకునే అవకాశం ఉంది. దీంతో దీనికి లాభాల పంట పండటం ఖాయం. ఇక ఈ ఏడాదిలో విడుదల అయిన సినిమాల్లో తొలి రోజున భారీ వసూళ్లను పొందిన సినిమాల జాబితా ఇలా ఉంది

జాబితా
1)అజ్ఞాతవాసి- రూ.23.36 కోట్లు
2)భరత్ అనే నేను-రూ.22.24 కోట్లు
3)రంగస్థలం-రూ.19.70 కోట్లు
4)నా పేరు సూర్య-రూ.16.28 కోట్లు
5)జై సింహా-రూ.6.85 కోట్లు
6)గీతగోవిందం-రూ.5.80 కోట్లు
7)భాగమతి-రూ.5.14 కోట్లు
8)కృష్ణార్జునయుద్ధం -రూ.4.61 కోట్లు
9)టచ్ చేసి చూడు-రూ.4.16 కోట్లు
10)నేల టికెట్ -రూ.3.37 కోట్లు
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications