టర్కిష్ ఉక్కుపై US సుంకాలను విధించిన నేపథ్యంలో, టర్కిష్ లిరాలో కుప్పకూలిన తరువాత రూపాయి విలువ 70 దిగువకు పడిపోయింది. రూపాయి విలువ డాలర్ తో పోల్చుకుంటే 70.08 కనిష్ట స్థాయికి చేరుకుంది.
టర్కిష్ ఉక్కుపై US సుంకాలను విధించిన నేపథ్యంలో, టర్కిష్ లిరాలో కుప్పకూలిన తరువాత రూపాయి విలువ 70 దిగువకు పడిపోయింది. రూపాయి విలువ డాలర్ తో పోల్చుకుంటే 70.08 కనిష్ట స్థాయికి చేరుకుంది, ఇది భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలపై భారీ ప్రభావం చూపింది.
క్షిణించిన రూపాయి ప్రభావం చూపే 7 అంశాలు చూడండి...

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు
ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలపై రూపాయి పతనం ప్రభావం మనకు కనిపిస్తోంది. ఇంధనం యొక్క రిటైల్ ధరలు ప్రస్తుతం పతాక స్థాయిలో ఉన్నాయి. ముంబయిలో పెట్రోల్ ధర రూ. 83.58 వద్ద ఉంది. డీజిల్ ధర రూ .72.96 వద్ద ఉంది.
భారతదేశం లో ముడి చమురు అవసరాలకు భారీగా దిగుమతి చేస్తుంది. రూపాయి రూ. 65 నుండి 70 వరకు క్షిణించడం వల్ల ఏది ఇంధనం పై ప్రభావం పడనుంది. భారతదేశంలో ఇంధన ధరలు పెరగడానికి రూపాయి పడిపోవడమే కారణం.

ద్రవ్యోల్బణం:
రూపాయి పడిపోవటం, పెట్రోల్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. భారతదేశం లో చాలా రవాణా, ముఖ్యంగా పండ్లు మరియు కూరగాయలు రోడ్డు ద్వారానే రవాణా జరగడం గమనించాల్సిన విషయం.ఇంధన పెరుగుదల కారణంగా పెట్రోల్, పండ్లు మరియు కూరగాయలతో సహా, ఇతర వస్తువుల ధరలు పెరిగాయి.ఇది వినియోగదారుల నెత్తిన భారం పడుతోంది

వడ్డీ రేట్లు పెరగడం:
రూపాయి పడిపోవటం, వడ్డీరేట్ల పెరుగుదలను కూడా ప్రేరేపిస్తుంది.గుర్తుంచుకోండి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బిఐ కి తప్పనిసరి అని చెప్పాలంటే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి వడ్డీ రేట్లు పెంచుకోవచ్చు. నిజానికి, జూలై నెలలో CPI పడిపోయింది. రానున్న నెలల్లో వడ్డీ రేట్లు పెంచే అవకాశం లేదు తద్వారా ఇంటి రుణాలు, ఆటో రుణాలు, వ్యక్తిగత రుణాలు మరియు బంగారు రుణాలపై రుణాలు పెరుగుతాయని దీని అర్థం.

విదేశీ చదువులు లేదా పర్యటనలు
విదేశీ పర్యటనలు మరియు విదేశాల్లో చదువుల ధర పెరగడానికి అవకాశం ఉంది. ప్రయాణ అవసరాలకు 10,000 డాలర్లు అంటే ఏడాది క్రితం రూ 6.6 లక్షలు ఖర్చు ఐయ్యేది కానీ ప్రస్తుతం రూ. 7 లక్షల వరకు ఖర్చు అవుతుంది.

కరెంట్ అకౌంట్ డిఫిసిట్:
ముడి చమురు ధరల పెరగడం తో సహా రూపాయి పడిపోవడంతో ఆర్ధిక వృద్ధికి తీవ్ర నష్టం వాటిల్లవచ్చు. 2018 లో ఎకనామిక్ సర్వే ప్రకారం చమురు ధరలో బ్యారెల్ పై $ 10 చొప్పున పెరిగితే ఆర్థిక వృద్ధి 0.2-0.3 శాతానికి తగ్గిపోతుంది మరియు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ $ 9-10 బిలియన్ డాలర్ల నుండి మరింత క్షిణిస్తుందని అంచనా వేశారు.

పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్ల నుండి డబ్బు ఉపసంహరణ
విదేశీ విక్రయ పెట్టుబడిదారులు డాలర్కు వ్యతిరేకంగా రూపాయి పడిపోతే, స్టాక్ మార్కెట్ల నుండి డబ్బును వెనక్కి తీసుకుంటారు. డాలర్ నిబంధనలలో వారి పోర్ట్ఫోలియో విలువ తగ్గిపోతుంది. కరెన్సీ అస్థిరత ఉన్నప్పుడు పెట్టుబడిదారులెవరు ముందుకు రారు. ఇది స్టాక్ మార్కెట్లలో కొంత భారం పడవచ్చు.

FMCG ఉత్పత్తుల ధరలు పెరుగుదల:
ఎఫ్ఎంసిజి ఉత్పత్తులైన సబ్బులు మరియు డిటర్జెంట్లు ఖరీదైనవిగా మారాయి, ముడి ధరల పెరుగుదల యొక్క ప్రత్యక్ష ఫలితంగా, రూపాయి పడిపోవడంతో కలిపి ఈ ప్రభావం కొనసాగుతోంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications