రిటైల్ ద్రవ్యోల్బణం తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి 4 .17 శాతానికి తగ్గడంతో సానుకూల ప్రభావం చూపింది. డాలర్ తో పోల్చుకుంటే రూపాయి 69.76 వద్ద ట్రేడ్ అవుతోంది.
సోమవారం నాడు డాలర్తో పోల్చుకుంటే 8 పైసలు బలహీనపడింది. రూపాయి విలువ డాలర్తో పోల్చుకుంటే 70 రూపాయలు పడిపోయింది. కరెన్సీ చివరిసారి 70.02 వద్ద డాలర్తో ట్రేడింగ్ జరిగింది.

సోమవారం నుండి మార్కెట్ కరెన్సీల నుంచి డాలర్ గణనీయంగా పెరిగిపోయింది ప్రధానంగా అమెరికన్ కరెన్సీకి వ్యతిరేకంగా టర్కిష్ లిరా కుప్పకూలడంతో భారీగా పుంజుకుంది.
టర్కీపై ఉక్కు దిగుమతులపై తాజా సుంకాలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసాడు దీని ఫలితంగా లిరాలో అత్యల్ప రికార్డులను నమోదు చేయడానికి కారణమైంది, ఇది భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలను దెబ్బతీసింది.
ఇదిలాఉండగా, భారతీయ స్టాక్ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి, సెన్సెక్స్ దాదాపు 0.50 శాతం పెరిగింది. ఐతే చాల మంది ఆర్థిక నిపుణులు భారతీయ మార్కెట్లు పడిపోతాయని బావించ్చారు
ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి 8.67 శాతం బలహీనపడింది, విదేశీ పెట్టుబడిదారులు వరుసగా $ 200.10 మిలియన్లు, ఈక్విటీ మరియు రుణ మార్కెట్లలో 5.20 బిలియన్ డాలర్లు విక్రయించారు.
ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలు కూడా క్షీణించాయి.టర్కీ లిరా గత 17 ఏళ్లలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది.


Click it and Unblock the Notifications