For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమరావతి బాండ్లు విడుదల చేసిన చంద్రబాబు నాయుడు.

By Sabari
|

రాజధాని అమరావతి నిర్మాణం కోసం బాండ్ల ద్వారా నిధులు సమీకరించే ప్రక్రియను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. మొత్తం రూ. 10,000 కోట్లను రాజధాని నిర్మాణానికి బాండ్ల ద్వారా సమీకరించాలన్నది ఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యం. ఇందులో భాగంగా తొలి విడతగా రూ. 1300 కోట్ల విలువైన బాండ్లను ఇవా ళ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్‌)లో సబ్‌స్క్రిప్షన్ కోసం ఉంచారు. ఒక్కో బాండ్ ముఖవిలువ రూ. 10 లక్షలు. కేవలం సంస్థాగత ఇన్వెస్టర్లకు మాత్రమే వీటిని జారీ చేస్తారు. ఈ నెలాఖరులో ఇవి బీఎస్ఈలో ట్రేడింగ్ కోసం లిస్ట్ చేస్తారు. ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన వస్తే మరో రూ. 700 కోట్ల బాండ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన ఉంటే ప్రభుత్వం ఈ ఇష్యూ ద్వారా రూ. 2000 కోట్లను సమీకరిస్తుందన్నమాట.ఇవాళ ప్రారంభించిన బాండ్ ఇష్యూకు ఎన్నారైల నుంచి అనూహ్య స్పదన లభించిందని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్‌ బాబు అన్నారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇన్వెస్టర్లు నిర్ణయానికి రావాలని, అమరావతి పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని పరిగణలో తీసుకోవద్దని ఆయన ఇన్వెస్టర్లను కోరారు.

అమరావతి బాండ్లు విడుదల చేసిన చంద్రబాబు నాయుడు.

త్వరలో రీటైల్ బాండ్లు
సాధారణ ప్రజలు కూడా రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యులు అయ్యేందుకు వీలుగా త్వరలో రీటైల్ బాండ్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వివిధ రకాల లాంఛనాలను పూర్తి చేస్తున్నామని, అన్నీ కుదిరితే అక్టోబర్ లేదా నవంబర్ లో రీటైల్ బాండ్లు జారీ చేస్తామని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. వీటి ముఖ విలువ రూ. 1000గా ఉంటుంది కాబట్టి.. సాధారణ ప్రజలు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసే అవకాశముంటుంది. వీటి ద్వారా రూ. 8000 కోట్లు సమీకరించాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం.

Read more about: andhra pradesh
English summary

అమరావతి బాండ్లు విడుదల చేసిన చంద్రబాబు నాయుడు. | Amaravathi Bonds Release in BSE

The AP government has initiated the process of raising funds through bonds for the construction of the capital Amravati. Total Rs. AP CM Chandrababu aims to assemble 10,000 crore bonds for capital development
Story first published: Tuesday, August 14, 2018, 15:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X