For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డాలర్ తో పోల్చి చూస్తే భారీగా పతనమైన రూపాయి మారకం.

టర్కీ ఆర్థిక సంక్షోభ భయాల నేపథ్యంలో వర్ధమాన మార్కెట్ల కరెన్సీలన్నీ నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతుండటం ఇందుకు కారణం. డాలర్ తో పోల్చుకుంటే రూపాయి కనిష్ట స్థాయికి బలహీనపడింది.

|

ముంబయి: టర్కీ ఆర్థిక సంక్షోభ భయాల నేపథ్యంలో వర్ధమాన మార్కెట్ల కరెన్సీలన్నీ నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతుండటం ఇందుకు కారణం. డాలర్ తో పోల్చుకుంటే రూపాయి కనిష్ట స్థాయికి బలహీనపడింది.ఉదయం 9.13 నిమిషాలకు, రూపాయి 69.46 వద్ద ట్రేడింగ్ జరిగింది, దాని మునుపటి ముగింపు 68.84 నుండి 0.9% పడిపోయింది. రూపాయి సోమవారం 69.49 వద్ద ప్రారంభమైనది,ఇది రూపాయి జీవిత కాల కనిష్ట స్థాయి. డాలర్‌తో పోలిస్తే టర్కీ లిరా ఏకంగా 12.5 శాతంమేర పతనమైంది. టర్కీ ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తుండటం ఇందుకు కారణం.

డాలర్ తో పోల్చి చూస్తే భారీగా పతనమైన రూపాయి మారకం.

టర్కీ నిర్బంధంపై ఇటీవలి వారాలలో ఉద్రిక్తతలు తీవ్రతరం ఇయ్యాయని అమెరికా లోని ఒక వార్త నివేదిక లో తెలిపింది. 10 సంవత్సరాల బాండ్ దిగుబడి 7.752% వద్ద ఉంది, ఇది శుక్రవారం నాటి ముగింపు 7.754%. బాండ్ దిగుబడి మరియు రూపాయి ధరలు వ్యతిరేక దిశల్లో కదులుతాయి.

బెంచ్మార్క్ సెన్సెక్స్ ఇండెక్స్ 0.43 శాతం లేదా 164.39 పాయింట్లు నష్టంతో 37,704 క్షీణించింది. జనవరి నుంచి చూస్తే ఇండెక్స్‌ దాదాపు 11.65 శాతంమేర లాభపడింది.
సోమవారం నాడు జూన్ నెలలో వినియోగదారుల ధరల సూచి (CPI) ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనుండటంతో ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి 7.7 శాతం బలహీనపడింది. విదేశీ పెట్టుబడిదారులు వరుసగా 260.40 మిలియన్ డాలర్లు, 5.43 బిలియన్ డాలర్లను ఈక్విటీ, డెట్ మార్కెట్లలో విక్రయించారు.

ఆసియా కరెన్సీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండోనేషియా రుపయా 0.9 శాతం, చైనా రాంమిన్ 0.49 శాతం, ఫిలిప్పీన్స్ పెసో 0.35 శాతం, తైవాన్ డాలర్ 0.31 శాతం, చైనా ఆఫ్షోర్ 0.29 శాతం, సింగపూర్ డాలర్ 0.19 శాతం, థాయ్ బట్ 0.19 శాతం, మలేషియన్ రింగిట్ 0.16 శాతం పుంజుకున్నాయి. అయితే, జపనీస్ యెన్ 0.59% పెరిగింది.

ఇతర దేశాల కరెన్సీతో అమెరికా డాలర్‌ పటిష్టతను తెలియజేసేత డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు 96.357తో పోలిస్తే 0.06 శాతం పెరుగుదలతో 96.412 వద్ద ఉంది.

Read more about: rupee dollar
English summary

డాలర్ తో పోల్చి చూస్తే భారీగా పతనమైన రూపాయి మారకం. | Rupee Hits FreshRecord Low Against US Dollar As Emerging Currencies Slide

The Indian rupee on Monday slumped to a fresh record low against the US dollar as emerging-market currencies weakened amid concern over the risk of contagion from Turkey’s financial-market turmoil.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X