For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రేకింగ్ న్యూస్ మన డబ్బు కూడా ఇప్పుడు మేడిన్ చైనా అంటా తెలుసా?

By Sabari
|

మేడిన్ చైనా ఇప్పుడు ఇండియాలో చిన్న పిల్లాడు వాడే బొమ్మ నుంచి పెద్ద పెద్ద వస్తువుల దాకా ఎక్కడ చూసినా ఈ ట్యాగ్ కనిపిస్తున్నది. ఆమేడిన్ చైనా వస్తువులను మన డబ్బు పెట్టి కొంటున్నాం.

 కరెన్సీ నోట్ల

కరెన్సీ నోట్ల

కానీ ఆ డబ్బు కూడా ఇప్పుడు మేడిన్ చైనా అయిపోయింది. ఇండియాతోపాటు పలు ఇతర దేశాల కరెన్సీ నోట్ల ముద్రణ కోసం చైనాకు భారీగా ఆర్డర్లు వచ్చినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక కథనం వెలువరించింది.

చైనా బ్యాంక్

చైనా బ్యాంక్

2013కు ముందు వరకు చైనా అసలు విదేశీ నోట్ల ముద్రణ జోలికి వెళ్లలేదని చైనా బ్యాంక్ నోట్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ లియు గుషెంగ్ వెల్లడించారు.

విదేశీ కరెన్సీ

విదేశీ కరెన్సీ

2013లో ఎప్పుడైతే ఆగ్నేయ ఆసియా, మధ్య ఆసియా, గల్ఫ్, ఆఫ్రికా, యూరప్‌లతో వాణిజ్యాన్ని పెంపొందించేందుకు బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టిందో అప్పటి నుంచి విదేశీ కరెన్సీ ముద్రణ ఊపందుకుంది.

కాంగ్రెస్ నేత శశి థరూర్

ఇండియాతోపాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, బ్రెజిల్, పోలాండ్‌లాంటి దేశాల కరెన్సీలను ముద్రించే చాన్స్ కొట్టేసింది. అయితే మన శత్రు దేశమైన పాకిస్థాన్‌తో ఎంతో సన్నిహితంగా ఉండే చైనాలో మన కరెన్సీ ముద్రణ జరగడంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆందోళన వ్యక్తంచేశారు. దీనివల్ల పాకిస్థాన్‌కు నకిలీ కరెన్సీ ముద్రించడం మరింత తేలిక అవుతుందని ఆయన ట్వీట్ చేశారు.

 సౌత్ మార్నింగ్ పోస్ట్

సౌత్ మార్నింగ్ పోస్ట్

అయితే చైనాలో తమ కరెన్సీ ముద్రిస్తున్న విషయాన్ని బయటకు చెప్పకూడదని, అలా చేయడం వల్ల తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్లు పలు ప్రభుత్వాలు చైనాను కోరినట్లు కూడా సౌత్ మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది

ముందడుగు

ముందడుగు

పాశ్చాత్య దేశాలను సవాలు చేసే దిశగా విదేశీ కరెన్సీ ముద్రణ ఓ పెద్ద ముందడుగు అని లియు గుషెంగ్ అన్నారు. గత శతాబ్ద కాలంగా విదేశీ కరెన్సీల ముద్రణలో పాశ్చాత్య దేశాల కంపెనీలు ముందుంటున్నాయి. ఇప్పుడా కంపెనీలకు చైనా సవాలు విసురుతున్నది.

Read more about: currency
English summary

బ్రేకింగ్ న్యూస్ మన డబ్బు కూడా ఇప్పుడు మేడిన్ చైనా అంటా తెలుసా? | Indian Currency Printing in China Report By South China Morning Post

China Printing Indian Currency Reported by south China Morning Post
Story first published: Monday, August 13, 2018, 15:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X