For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నష్టాలలో బాటలో ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్ మీరే చూడండి.

By Sabari
|

గురువారం జీవనకాల గరిష్ఠస్థాయికి చేరి కొత్త రికార్డు నమోదు చేసిన సూచీలు.. శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటల సమయానికి సెన్సెక్స్ 124.61 పాయింట్ల నష్టంతో 37,899 వద్ద, నిఫ్టీ 34.15 పాయింట్ల నష్టంతో 11,438.4 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ ఉదయం 15 పైసల నష్టంలో 68.83 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం 3 పైసల లాభంతో 68.99 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. బులియన్ మార్కెట్లో 43 పాయింట్లు తగ్గి ప్రస్తుతం 29,625 వద్ద ట్రేడ్ అవుతోంది.

నష్టాలలో బాటలో ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్ మీరే చూడండి.

మరోవైపు.. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫలితాలు శుక్రవారం వెలువడాల్సి ఉండటంతో.. ఆ బ్యాంక్‌ షేర్లు కూడా ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్‌లో ఐటీ, మెటల్‌ షేర్లు కాస్త బలంగా ట్రేడవుతున్నాయి. దేశీయ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాదాపు 10 శాతం మేర నష్టాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ధర 6.36శాతం పడిపోయి రూ. 282.50 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్‌ షేర్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి

Read more about: stock market
English summary

నష్టాలలో బాటలో ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్ మీరే చూడండి. | Stock Market Running Lose Today

Equity benchmarks continued to trade lower, with the Sensex falling over 100 points, while the Nifty dropped quarter of a percent.
Story first published: Friday, August 10, 2018, 13:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X