నేడు దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఈ విదంగా ఉన్నాయి.
ఇంధన రిటైల్ వర్తకాలు పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు అన్ని మెట్రో నగరాల్లో రెండవరోజు ధరలలో ఎటువంటి మార్పు లేదు. గురువారం, పెట్రోలు లీటరు న్యూఢిల్లీలో రూ. 77.06 రూపాయలు.
ఇంధన రిటైల్ వర్తకాలు పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు అన్ని మెట్రో నగరాల్లో రెండవరోజు ధరలలో ఎటువంటి మార్పు లేదు. గురువారం, పెట్రోలు లీటరు న్యూఢిల్లీలో రూ. 77.06 రూపాయలు, కోల్కతాలో రూ. 80, ముంబైలో రూ. 84.50, చెన్నైలో రూ. 80,05. అదేవిదంగా డీజిల్ న్యూఢిల్లీలో రూ. 68.50, కోలకతాలో రూ.71.31, ముంబయిలో రూ. 72.72, చెన్నైలో రూ. 72.35 గా ఉన్నాయని దేశంలోని అతి పెద్ద ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ డేటా చూపించింది.ఈ పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం ఉదయం 6 గంటలకు అమలులోకి వచ్చాయి.

అంతర్జాతీయంగా, చమురు ధరలు ఇరానియన్ ముడి సరఫరాలకు సంబంధించిన ఆందోళనలకు గురవుతున్నాయి. టెహ్రాన్ కు కొత్తగా ఆంక్షలు విధించాయి. చైనా-అమెరికా వివాదం పెరిగిపోతున్న నేపథ్యంలో గత సెషన్లో క్షీణత నిలిచిపోయింది. చైనా డిమాండ్పై ఆందోళనలు నెలకొన్నాయని రైటర్స్ అన్నారు.
బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 30 సెంట్లు లేదా 0.4 శాతం పెరిగి $72.58 డాలర్లకు చేరాయి బుధవారం ఇది 3 శాతం కన్నా ఎక్కువ క్షీణించింది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ముడి ఫ్యూచర్స్ గత సెషన్లో 3.22 శాతం పడిపోయిన తరువాత, బ్యారెల్కు $ 67.05 కు 11 సెంట్లు లేదా 0.2 శాతం పెరిగాయి.
మంగళవారం ఇరాన్పై అలానే కొన్ని పరిశ్రమలపై అమెరికా ఆంక్షలు విధించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలోని ముడి చమురు దిగుమతులను తగ్గించాలని వీలైనన్ని దేశాలు కోరుకుంటున్నాయన్నారు.అయితే నూతన ఆంక్షలు నేరుగా ఇరానియన్ చమురు పై ప్రభావం చూపదన్నారు.


Click it and Unblock the Notifications