ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్ ఇండియా కు కేంద్రం భారీ నిధులు?
ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్ ఇండియాకు రూ 11,000 కోట్ల బెయిలవుట్ ప్యాకేజీ ప్రకటించే యోచనలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరుగుతున్నాయి.
ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్ ఇండియాకు రూ 11,000 కోట్ల బెయిలవుట్ ప్యాకేజీ ప్రకటించే యోచనలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరుగుతున్నాయి. నష్టాలను నివారించేందుకు వైమానిక సంస్థను ప్రైవేటీకరించడానికి విఫల ప్రయత్నం నేపథ్యంలో చర్చలు కొనసాగుతున్నాయి.

సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ క్యారియర్ కోసం ఒక బెయిలవుట్ ప్యాకేజీని పరిశీలిస్తున్నట్టు తెలిపింది, ఇది అత్యధిక వ్యయంతో కూడిన మూలధన రుణాలను తగ్గించడానికి ఉపయోగించబడుతుంది.
ఎయిర్ ఇండియాకు రూ .11 వేల కోట్ల ప్యాకేజీని అందించడం కోసం ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలో ఉందని తెలిపారు.ఎయిర్ ఇండియా బ్యాలన్స్ షీటును మెరుగుపరచడం వల్ల వ్యూహాత్మక విక్రయానికి ప్రభుత్వం తిరిగి ప్రయత్నించినప్పుడు అది ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారుతుంది అని సంస్థ కు చెందిన ఒకరు అన్నారు.
2012 లో మునుపటి యుపిఎ హయాంలో బెయిలవుట్ ప్యాకేజీ ఎయిర్లైన్స్ కు ఇవ్వడం జరిగింది.మార్చి 2017 నాటికి జాతీయ క్యారియర్ రుణ భారం రు .48,000 కోట్లకు పైగా ఉంది.గత నెలలో ప్రభుత్వం ఈక్విటీ ఇన్ఫ్యూషన్కు సప్లిమెంటరీ గ్రాంట్లుగా రూ .980 కోట్లు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.ఎయిర్లైన్స్ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో, సిబ్బందికి వరుసగా ఐదు నెలలు జీతాలు ఆలస్యం జరిగాయి.
"ఎయిర్ ఇండియా ఈ రోజు వరకు ఈక్విటీ ఇన్ఫ్యూషన్ 27,195.21 కోట్ల రూపాయలు పొందింది అని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా గత నెలలో లోక్సభకు తెలిపారు.


Click it and Unblock the Notifications