బంగారు అక్రమ రవాణా చేయడంలో సరికొత్త విధానాలు చూడండి.

డైరెక్టరేట్ రెవెన్యూ ఆఫ్ ఇంటెలిజెన్స్ (DRI) బంగారు స్మగ్లింగ్ చేస్తున్న ఒక పెద్ద ముఠా గుట్టు బట్టబయలు చేసింది.బంగారు తరలించడానికి వీరు ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేసారు.

డైరెక్టరేట్ రెవెన్యూ ఆఫ్ ఇంటెలిజెన్స్ (DRI) బంగారు స్మగ్లింగ్ చేస్తున్న ఒక పెద్ద ముఠా గుట్టు బట్టబయలు చేసింది.బంగారు తరలించడానికి వీరు ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేసారు.

బంగారు అక్రమ రవాణా చేయడంలో సరికొత్త విధానాలు చూడండి.

మొత్తం 60 విద్యుత్ పరికరాలలో బంగారు ఉన్నట్టు చెప్పారు, వాటిలో బంగారు కడ్డీలు 360 ముక్కలు దాగి ఉన్నట్లు గుర్తించామన్నారు.ఒకప్పుడు స్మగ్లింగ్ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తుల ద్వారానో లేదా లగేజి పెట్టెల్లోనో అధికారుల కంట పడకుండా తరలించేవారు.కానీ ప్రస్తుతం సాంకేతికత శరవేగంగా పెరుగుతున్న తరుణంలో అత్యాధునిక తనిఖీ పరికరాలు అందుబాటులో వచ్చేసాయి కానీ వీటితో పాటు స్మగ్లర్లు కూడా కొత్త ఆలోచనలతో ఆరితేరిపోయారు,ఆధునిక పరికరాలు సైతం పసిగట్టలేని విదంగా బంగారం తరలిస్తున్నారు.

గతంలో ఇప్పటిదాకా చూసిన వాటిలో అక్రమ రవాణాదారులు శరీర భాగాలు, సిగరెట్లు, డైపర్లు మరియు పాల పొడిలో బంగారు దాచి రవాణా చేస్తూ పట్టుబడిన సంగతులు చూసాము. బంగారు కడ్డీలు పరికరాల్లో దాచడం వల్ల ఏజన్సీలను తప్పుదోవ పట్టించగలదు.

హొంక్ కాంగ్ నుండి కాథే పసిఫిక్ ఎయిర్లైన్స్ కు వచ్చిన కొన్ని అనుమానాస్పద డబ్బాలను అదుపులోకి తీసుకున్నామన్నారు.సందేహం వచ్చి వాటిలో కొన్నింటిని పగలకొట్టి చూడగా కాపర్ పరికరాలు ఉండాల్సిన స్థానం లో బంగారు కడ్డీలు ఉన్నట్టుగా గుర్తించ్చారు.మొత్తం 60 విద్యుత్ పరికరాల్లో 360 బంగారు కడ్డీలు లభ్యం కాగా వీటి బరువు 18KG లు ఉన్నట్టు విలువ సుమారు రూ.5 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+