ఇటీవలే కనీస సగటు నిల్వ ఛార్జీల పేరిట బ్యాంకుల వసూళ్లపై వార్తలు వైరల్ అవుతుంటే ఎస్బీఐ స్పందించింది. ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించలేదన్న సాకుతో వినియోదారుల నుంచి బ్యాంకులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కోట్ల మేర జరిమానాను వసూలు చేశాయని వస్తున్న వార్తలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ నుంచి తాము ఖాతాలో నిర్వహించదగ్గ కనీస సగటు నిల్వను 40 శాతం తగ్గించామని పేర్కొంది.

అంతేకాక 40 శాతం పొదుపు ఖాతాలను ఈ నిబంధనల నుంచి మినహాయించామని వెల్లడించింది. కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోతే విధించే ఛార్జీలు, బ్యాంకింగ్ రంగంలోనే తమవి అత్యంత తక్కువని స్టేట్ బ్యాంక్ వివరించింది. ఎస్‌బీఐ భారీ మొత్తంలో జరిమానాలు విధించింది అని వస్తున్న రిపోర్టులపై బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. ఎస్‌బీఐ ఆ నిబంధనల కింద నాలుగు కేటగిరీల్లో శాఖలను వేరు చేసింది. రూరల్, సెమీ-అర్బన్, అర్బన్, మెట్రో ఇలా బ్రాంచు ఉండే ప్రాంతం బట్టి సగటు నెలవారీ నిల్వలు బ్యాంక్ అకౌంట్‌లో తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ కస్టమర్ కనుక ఈ నిల్వలను నిర్వహించలేని పక్షంలో, జరిమానాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. పొదుపు ఖాతాలకు సంబంధించి మెట్రో ప్రాంతాల్లో అయితే రూ.3000, సెబీ అర్బన్ ప్రాంతంలో రూ.2000, రూరల్ బ్రాంచీల్లో రూ.1000గా కనీస నిల్వ నిబంధన ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications