తెలుగు బిగ్ బాస్ 2 లో ఎలిమినేట్ ఐన ఆరుగురిలో ఇద్దరినీ అంటే నూతన నాయుడు మరియు శ్యామలను ఓటింగ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చారు.

ఎక్కువ ఓటింగ్
ఈ ఆరుగురిలో వీళ్లిద్దరికీ ప్రేక్షకుల నుండి ఎక్కువ ఓటింగ్ వచ్చింది అని బిగ్ బాస్ నిర్వాహుకుల మాట. ఇక నేను కామన్ మ్యాన్ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరైన నూతన నాయుడు మొదట హౌస్ లోకి రావడానికి రూ.4 కోట్లు ఇచ్చాడు అని బయట టాక్.

బిగ్ బాస్ యాజ్యమానికి
అయితే రూ.4 కోట్లు ఇస్తే రెండో వారంలో ఎలిమినేట్ చేయరు కదా! కాబ్బటి ఆ వార్తలో ఎలాంటి నిజం లేదు అని తెలిసిపోయింది. కానీ ఇప్పుడు నూతన నాయుడు రీఎంట్రీ కోసం బిగ్ బాస్ యాజ్యమానికి భారీగా డబ్బులు ఇచ్చాడు అని బయట టాక్ వస్తోంది.

భారీగా ప్రమోషన్
బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక కౌశల్ ఫాన్స్ ఎలా ఉన్నారో తెలుసుకొని మరియు బిగ్ బాస్ రీఎంట్రీ అనౌన్స్ చేసారో అప్పటి నుంచి భారీగా ప్రమోషన్ ప్రారంభించాడు.

కౌశల్ ఆర్మీని
కౌశల్ ని ఆకాశానికి ఎత్తేస్తూ అతని కౌశల్ ఆర్మీని తనవైపు తిప్పుకొన్నాడు అంతేకాక ఆవేశంగా మాట్లాడుతూ దాదాపు వంద వీడియోలు చేసి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

రాజకీయంగా ఎదగాలి
ఈ సోషల్ మీడియా ప్రచారం కోసం నూతన నాయుడు దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేసిన్నట్లు బయట ప్రచారం జరుగుతోంది. అలాగే నూతన నాయుడు రాజకీయంగా ఎదగాలి అని ఉదేశంతోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు అని చెబుతున్నారు.

స్టార్ డమ్
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రెండు వారాలకే ఇంత గుర్తింపు వస్తే ఇక నాలుగు వారలు ఉంటే చాలా స్టార్ డమ్ వస్తుంది అని రాజకీయంగా ఎదగచ్చు అని ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

కౌశల్ తో
రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా నూతన్ నాయుడు చాలా ప్లాన్ చేసుకొని ఎక్కువ సేపు కౌశల్ తో బయట జరుగుతున్న అన్ని విషయాలు చెప్పుకుంటూ కౌశల్ ఆర్మీని తన వైపు తిప్పుకోవాలి అని చూసుకుంటున్నాడు అని తెలుస్తోది.

నాని
కానీ నాని చెప్పిన్నట్లు బిగ్ బాస్ ఆడుతున్న ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవలసింది ఒకటే గేమ్ అంటే ఒక్కరే గెలుస్తారు.కానీ నూతన్ నాయుడు గేమ్ ప్లాన్ ఏంటో ఎవరికి అర్థంకాలేదు


Click it and Unblock the Notifications