నవ్యాంధ్రకు పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తి సంస్థ హోలీటెక్ ఏపీ సర్కార్‌తో కీలకమైన ఎంవోయూ చేసుకుంది. అమరావతిలో మంత్రి లోకేష్ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. హోలీటెక్ కంపెనీ భారతదేశంలోనే మొదటిగా ఏపీలో రూ.1400కోట్ల పెట్టుబడి పెడుతోంది. తిరుపతి సమీపంలో 75 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ హోలీటెక్ ప్లాంట్‌లో.. ప్రతినెలా 5కోట్ల మొబైల్ విడిభాగాలను ఉత్పత్తి చేయనున్నారు. ఈ కంపెనీ ద్వారా 6వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

హోలీటెక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు మంత్రి నారా లోకేష్. ఈ కంపెనీకి చైనాలో 16 ఫ్యాక్టరీలు ఉన్నాయని.. దేశంలోనే మొదటిసారిగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. హోలీటెక్ మొత్తం ఐదు ప్రొడక్ట్‌లు .. టిన్ ఫిలిమ్ ట్రాన్సిస్టర్, లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు, కేపాసిటర్ టచ్ స్ర్ర్కీన్, సీసీఎం (కాంపోనెట్ కేమ్రామోడ్యూల్), ఫింగర్ ప్రింట్ మాడ్యూల్‌ను ఇక్కడే తయారు చేయనున్నారని చెప్పారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు హోలీటెక్ ప్రతినిధి మనజియన్. చంద్రబాబు విజన్ ఉన్న సీఎం అని.. అందుకే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించామన్నారు. ఇక్కడే హోలీటెక్ అతిపెద్ద ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోందని చెప్పారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications