గోవా వెళ్ళాలి అనుకుంటున్నావారికీ గో ఎయిర్ బంపర్ ఆఫర్! పండగ చేసుకోండి.
ఫెస్టివల్ సీజన్ మొదలుకానుండడంతో విమానయాన సంస్థల మధ్య అఫర్ల పోటీ షురూ అయ్యింది. చౌక ధరల విమానయాన సంస్థ గో ఎయిర్ మరోమారు భారీ ఆఫర్లను ప్రకటించింది. ఏకంగా పది లక్షల సీట్లను భారీ డిస్కౌంట్‌తో విక్రయానికి పెట్టింది. కొన్ని మార్గాల్లో టికెట్ల ప్రారంభ ధర కేవలం రూ.1,099 మాత్రమే కావడం విశేషం. పేటీఎం ద్వారా టికెట్లను కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం (గరిష్ఠంగా రూ.250) ప్రత్యేక రాయితీ కూడా లభిస్తుంది.

'ఫెస్టివల్ సీజన్' పేరుతో శనివారం నుంచే అందుబాటులోకి తెచ్చిన ఈ ఆఫర్ ఆగస్టు 9 వరకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసిన టికెట్లపై శనివారం నుంచి డిసెంబరు 31 వరకు అన్ని సెక్టార్లలోని గో ఎయిర్ విమానాల్లో ప్రయాణించవచ్చని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
గో ఎయిర్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకునే వినియోగదారుల కోసం రూ.3000 వరకు రాయితీ పొందేందుకు ఎక్స్‌క్లూజివ్ డీల్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం గో ఎయిర్ దేశవ్యాప్తంగా అహ్మదాబాద్, బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, గోవా, జమ్ము, కొచ్చి, లక్నో, ముంబై, పాట్నా, రాంఛి సహా 23 ప్రాంతాలకు సర్వీసులు నడుపుతుండగా వారానికి 1,544 విమాన సేవలు ఆపరేట్ చేస్తోంది.
గత నెల మొదటి వారంలో గో ఎయిర్‌కు పోటీ విమానయాన సంస్థ ఇండిగో కూడా భారీ ఆఫర్లు ప్రకటించింది. రూ.1,212ల ప్రారంభ టిక్కెట్‌తో ఏకంగా 1.2 మిలియన్ సీట్లను అందుబాటులో ఉంచింది. విదేశీ టికెట్లకు కూడా ఆఫర్ వర్తింపజేసింది. దీంతో ఈ పోటీని సమర్థవంతంగా తిప్పికొట్టేలా ఇప్పుడు గో ఎయిర్ కూడా రంగంలోకి దిగి భారీ ఆఫర్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications