ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా లెక్కచేయని మల్టీప్లెక్స్ ఓనర్లు
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ప్రభుత్వాధికారులు గతకొన్ని రోజులుగా హెచ్చరించినా అవేమి పట్టనట్టే వున్నారు కొందరు మల్టీప్లెక్స్ నిర్వాహకులు. థియేటర్స్‌లో విక్రయించే తినుబండారాలను ఎమ్మార్పీ ధరకే విక్రయించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు తొలిరోజే గండికొట్టారు కొంతమంది థియేటర్స్, మల్లీప్లెక్స్ నిర్వాహకులు.

పలు మల్టీప్లక్స్‌ల్లో
నగరంలోని పలు మల్టీప్లక్స్‌ల్లో ఎప్పటిలాగానే అధిక ధరలకు స్నాక్స్‌ను విక్రయించారు. ప్రభుత్వ నిబంధలు ఎక్కడా అమలు కాకపోవడంతో ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు.

ఆగస్టు నుంచి
ఆగస్టు1 నుంచి థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో కూల్ డ్రింక్స్, పాప్‌కార్న్, సమోసా,ఐస్‌క్రీమ్,నీటి బాటిళ్ల వంటివాటినీ ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని ప్రభుత్వం జారీ చేసిన నిబంధన చాలా చోట్ల అమలు కాలేదు.

ఎమ్మార్పీ
సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో మాత్రం 80 శాతం ధరలు తగ్గించి తూనికలు కొలతల శాఖ నిబంధనల ప్రకారం ఎమ్మార్పీ వసూలు చేస్తున్నట్లు బోర్డులను ఏర్పాటు చేసారు. మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో మాత్రం రకారకాల పేర్లతో ప్రేక్షకుల జేబులను ఖాళీ చేస్తున్నారు

మల్టీప్లెక్స్ యాజమాన్యాలు
నగరానికి చెందిన మంజీరా మాల్, ప్రసాద్ ఐమాక్స్, మంత్రామాల్ అత్తాపూర్ సహా ఎన్నో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయకుండా రకరకాల పద్దతుల్లో ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు

వాట్సాప్ నంబర్
అధిక ధరలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 180042500333 పాటు వాట్సాప్ నంబర్ 7330774444ను థియేటర్స్ యాజమాన్యం ఖచ్చితంగా ప్రదర్శంచాలి. ఎక్కువ మటుకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వ ఉత్తర్వులను ఖచ్చితంగా పాటిస్తున్నాయి.


Click it and Unblock the Notifications