స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యంలో అమెజాన్ ఇండియా మరో సేల్‌ను ప్రకటించింది. దీనికి అమెజాన్ ఫ్రీడమ్ సేల్ అనే పేరు పెట్టారు. ఆగస్ట్ 9 నుంచి ఆగస్ట్ 12 అర్ధరాత్రి వరకు ఈ సేల్ కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్స్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, టీవీలులాంటి వాటిపై మొత్తం 20 వేల డీల్స్ అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. వన్‌ప్లస్, వివో, జేబీఎస్, ఎల్‌జీ, ఫిలిప్స్, కాసియో బ్రాండ్లపై పెద్ద ఎత్తున ఆఫర్లు ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా పది శాతం రాయితీ లభిస్తుంది. అన్నిఉత్పత్తులపై ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయని అమెజాన్ తెలిపింది. ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్లు, యాక్సెసరీలపై 40 శాతం వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.

వన్‌ప్లస్ 6, రియల్‌మి 1 6జీబీ, హానర్ 7ఎక్స్, మోటో జీ6, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8, హువావీ పీ20 లైట్, హానర్ 7సీ, మోటో ఈ5 ప్లస్, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్, వివో నెక్స్, నోకియా 6.1, ఒప్పో ఎఫ్5, ఎల్జీ వీ30లాంటి మొబైల్స్‌పై ఎక్స్చేంజీతో కూడిన డిస్కౌంట్లు సైతం ఉంటాయి. సేల్‌లో భాగంగా హానర్ ప్లే, హువావీ నోవా 3ఐ, బ్లాక్‌బెర్రీ కీ2 మొబైల్స్ కూడా లాంచ్ చేయనున్నారు. ఆగస్ట్ 9న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానున్న సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9 కూడా సేల్‌లో భాగంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మొబైల్స్ కాకుండా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ల్యాప్‌టాప్స్, కెమెరాలు, హెడ్‌ఫోన్లపై కూడా భారీగా ఆఫర్లు ప్రకటించింది అమెజాన్.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications