ఎస్‌బీఐ కస్టమర్లకు జియో గుడ్ న్యూస్ చెప్పింది. మెరుగైన డిజిటల్ బ్యాకింగ్ సేవలతో పాటు పేమెంట్స్, ఈకామర్స్ సేవలను అందించేందుకు ఎస్‌బీఐతో ఒప్పందం కుదుర్చుకుంది.

మై జియో యాప్
మై జియో యాప్‌తో ఎస్‌బీఐ యోనో యాప్‌ను అనుసంధానం చేసేందుకు రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. ఈ మేరకు ముంబైలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సమక్షంలో ఎస్‌బీఐ, జియో ప్రతినిధులు మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంవోయూ)పై సంతకాలు చేశారు.

ఎస్‌బీఐ
ఈ ఒప్పందంతో జియో ద్వారా ఎస్‌బీఐకి ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయి. యోనో యాప్ ద్వారా ఇప్పటికే కస్టమర్లకు బ్యాకింగ్, కామర్స్, సూపర్ స్టోర్ సర్వీసులను అందిస్తోంది ఎస్‌బీఐ.

తక్కువ ధరకే
ఐతే ఇకపై 'మై జియో' యాప్ నుంచి సైతం ఎస్‌బీఐ లావాదేవీలు చేసుకోవచ్చు. వాటితో పాటు టాక్సీ బుకింగ్, బిల్ పేమెంట్స్, సూపర్ స్టోర్ సేవలను పొందవచ్చు. ఎస్‌బీఐ రివార్డ్స్‌ను రిలయన్స్ రిటైల్, జియో, ఇతర పార్ట్‌నర్ బ్రాండ్స్‌లోనూ రిడీమ్ చేసుకోవచ్చు. ఇక జియో ఫోన్‌లు సైతం ఎస్‌బీఐ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్ల కింద తక్కువ ధరకే లభిస్తాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు
ఏప్రిల్‌లో ఎస్‌బీఐతో కలిసి పేమెంట్స్ బ్యాంక్‌ని ప్రారంభించింది జియో.ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 70 శాతం వాటా ఉండగా. మరో 30 శాతం వాటాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిగి ఉంది.

దేశంలోనే అతి పెద్ద
ఇండియాలో అతి పెద్ద ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్స్‌లో మై జియో కూడా ఒకటి. కాగా, జియో రిలయన్స్ సబ్సిడరీ సంస్థ అన్న విషయం తెలిసిందే. ఇక ఎస్‌బీఐ దేశంలోనే అతి పెద్ద బ్యాంకు.42 కోట్ల 40 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లు ఎస్‌బీఐకి ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications