ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ జెట్ ఎయిర్‌వేస్ లిమిటెడ్ దివాళా తీసే పరిస్థితుల్లో ఉంది. కంపెనీలోని పైలట్లు తమ జీతాలు తగ్గించుకోవడంతోపాటు ఇతర ఖర్చులు తగ్గించకపోతే 60 రోజుల్లోనే కంపెనీ మూతపడే ప్రమాదం ఉందని ఆ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. పైలట్లు తమ జీతాలను 15 శాతం మేర తగ్గించుకోవాలని రెండేళ్లుగా జెట్ ఎయిర్‌వేస్ కోరుతూ వస్తున్నా.. వాళ్లు అందుకు నిరాకరించారు. దీంతో ఎయిర్‌లైన్స్ మరిన్ని కష్టాల్లో కూరుకుపోయింది. సేల్స్, డిస్ట్రిబ్యూషన్, పేరోల్, మెయింటనెన్స్‌లాంటి వాటిలో ఖర్చులు తగ్గించే పనిలో సంస్థ ఉంది. దీనికి సంబంధించి అందరు భాగస్వాములతో యాజమాన్యం చర్చిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. జెట్ ఎయిర్‌వేస్ రుణాల కోసం ప్రయత్నిస్తున్నా.. సంస్థ మళ్లీ లాభాల్లోకి వస్తుందన్న హామీ ఇవ్వాలని బ్యాంకులు స్పష్టంచేస్తున్నాయి.

అందులో భాగంగానే జీతాల్లో కోత విధించాలని చూస్తున్నది. సంస్థలో కొన్ని కిందిస్థాయి ఉద్యోగులను తొలగించే పని కూడా మొదలుపెట్టనుంది. ఈ ఎయిర్‌లైన్స్ షేర్లు కూడా శుక్రవారం 4.2 శాతం మేర పతనమయ్యాయి. నిజానికి విమాన ఇంధన ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం భారత ఎయిర్‌లైన్స్ సంస్థలను దెబ్బతీస్తున్నది. దేశంలోనే పెద్దదైన ఎయిర్‌లైన్స్ ఇండిగో కూడా తమ లాభాలు 97 శాతం మేర క్షీణించాయని ప్రకటించింది. జెట్ ఎయిర్‌వేస్ తమ లాభాలను పెంచుకునేందుకు దేశీయ రూట్లపై దృష్టిసారిస్తున్నది. దీనికోసం ప్రత్యేకంగా 75 బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం ఆర్డర్ ఇచ్చింది. దీని ద్వారా సంస్థ సామర్థ్యం పెంచుకోవడంతోపాటు ఖర్చులు తగ్గి, సంస్థ పోటీలో ఉంటుందని జెట్ ఎయిర్‌వేస్ భావిస్తున్నది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications