కుటుంబం పై అలిగి బిచ్చగాడిలా మారిన కోటీశ్వరుడు! ఎక్కడో తెలుసా?
ఒక కోటీశ్వరుడు బిచ్చగాడుగా మారాడు అంటే అందరు ఏమి అనుకుంటారు అతను చేసే వ్యాపారంలో నష్టాలు వచ్చి లేదా చెడు వ్యసనాలు వల్ల లేదా అయినవారు వ్యాపారంలో మోసం చేయడం వల్ల ఇలా ఐపోయింటాడు అని అనుకుంటాం.

వ్యాపారవేత్త
కానీ ఇప్పుడు మేము చెప్పేది వింటే మీరు షాక్ అవుతారు ఒక టాప్ వ్యాపారవేత్త తన కుటుంబం మీద కోపంతో బిచ్చగాడు అయ్యాడు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.

విల్లాపురం
తన కుటుంబ సభ్యులు తన మాట ఎవరు వినడం లేదు అని బిచ్చగాడుగా మారాడు అసలు ఇది ఎక్కడ జరిగింది అంటే తమిళనాడు రాష్ట్రం చెన్నై పట్టణంలో విల్లాపురం జిల్లాలో జరిగింది.

నటరాజన్
ఈ ప్రాంతానికి చెందిన నటరాజన్ ఒక కోటీశ్వరుడు అతనికి భార్య మరియు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందరు ఒకే ఇంట్లో నివసిస్తుంటారు. కొన్ని నెలల క్రితం నటరాజన్ కు తన కోడలు గొడవ జరిగింది.

మనస్థాపంతో
ఈ గొడవలో కుటుంబ సభ్యులు కూడా కోడలికే సపోర్ట్ చేసారు ఇంటి యజమానిగా అతనిని ఎవరు పట్టించుకోలేదు.దింతో నటరాజన్ భార్య మరియు పిల్లల పై అలిగి మనస్థాపంతో ఇంటి నుంచి బయటకి వచ్చేసాడు.

మురుగన్
ఇంటి నుంచి బయటకి వచ్చి తిరుపూర్ మురుగన్ ఆలయంలోనే మూడు నెలలు ఉంది అక్కడే ప్రసాదాలు తింటూ బ్రతికేవాడు అతను కోసం భార్య పిల్లలు అనేక ప్రాంతాలలో వెతికారు.

బిక్షగాడి రూపంలో
ఈ క్రమంలో ఆదివారం తిరుపూర్ మురుగన్ ఆలయానికి వచ్చిన తన భార్య మరియు పిల్లలకు నటరాజన్ బిక్షగాడి రూపంలో కనిపించాడు వెంటనే అతడి కుటుంబ సభ్యులు అతనిని క్షమించమని కోరి కారులో ఇంటికి తీసుకెళ్లారు.

కోటీశ్వరుడు
ఇన్ని రోజులు గుడి ముందర బిక్షం ఎత్తుకున్న వ్యక్తి ఒక కోటీశ్వరుడు అని తెలుసుకొని గుడి దగ్గర ఉన్న స్థానికులు అంత ఆశ్చర్యపోయారు.

పెద్దవారు ఉన్నప్పుడే
ఇక్కడ అందరు గురించాల్సింది ఏంటి అంటే పెద్దవారు ఉన్నంతవరకు వారి విలువ మనకు తెలియదు వారు దూరం అయితే తప్ప కనుక పెద్దవారు ఉన్నప్పుడే వారికీ వారి మాటకి విలువనిద్దాం.


Click it and Unblock the Notifications