గత రెండు రోజులు స్థిరంగా కొనసాగిన పెట్రోల్ ధరలు పెరిగాయి.
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఒసి) ప్రకారం పెట్రోలు, డీజిల్ ధరలు రెండు రోజుల పాటు స్థిరంగా కొనసాగిన తరువాత గురువారం పెరిగాయి.
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఒసి) ప్రకారం పెట్రోలు, డీజిల్ ధరలు రెండు రోజుల పాటు స్థిరంగా కొనసాగిన తరువాత గురువారం పెరిగాయి. న్యూఢిల్లీలో ఒక లీటరు పెట్రోలు రూ. 76.43, కోల్కతాలో రూ. 79.33, ముంబైలో రూ. 83.87, చెన్నైలో రూ. 79.39 ఐఒసి వెబ్సైట్ Iocl.com డేటా ప్రాకారం.

అదేవిదంగా లీటరు డీజిల్ న్యూఢిల్లీలో రూ. 67.93, కోల్కతాలో రూ. 70.69, ముంబైలో రూ. 72.12, చెన్నైలో రూ. 71,74.
గురువారం ఉదయం 6 గంటలకు పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు వర్తిస్తాయి.
బుధవారం పెట్రోల్ న్యూఢిల్లీలో రూ .76.31 కోల్కతాలో రూ. 79.20, ముంబైలో రూ. 83.76, చెన్నైలో రూ. 79,26.అలాగే డీజిల్ న్యూఢిల్లీలో రూ.67.82 కోల్కతాలో రూ. 70.58, ముంబైలో రూ. 72, చెన్నైలో రూ. 71,62.
పెట్రోలు ధర ఢిల్లీలో 12 పైసలు, కోల్కతా, చెన్నైలలో 13 పైసలు, ముంబయిలో 11 పైసలు పెరిగాయి. ముంబయి, చెన్నైలలో డీజిల్ పై 12 పైసలు మరియు కోల్కతా,ఢిల్లీ లో డీజిల్ పై 12 పైసలు పెరిగాయి.
ప్రపంచంలోని ముడి చమురు ధరలు, రూపాయి విలువ అమెరికా డాలర్కు వ్యతిరేకంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ ఇంధన రిటైలర్ల ద్వారా నిర్ణయిస్తారు.
బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 0.2 శాతం పెరిగి 72.56 డాలర్లకు చేరగా అంతకు ముందు రోజు 2.5 శాతం పడిపోయింది.
అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ బుధవారం 1.6 శాతం పడిపోయి 0.3 శాతం పెరిగి 67.86 డాలర్లకు చేరింది.
రిజర్వ్ బ్యాంక్ రిపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేరకు పెంచడంతో బుధవారం రూపాయి విలువ డాలర్కు వ్యతిరేకంగా రెండు వారల గరిష్ట స్థాయికి చేరి 11 పైసలు పెరిగి 68.43 వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications