మీరు ఓ వాచ్ కొందామనుకుంటారు. బయట మార్కెట్‌లో ఓ రేటుంటుంది. అమెజాన్‌లో ఒక రేటుంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో మరో రేటుంటుంది.

భారీ ఆఫర్లు
ఇలా ఒక్కో చోట ఒక్కో ధర ఉంటే ఎక్కడ ఎక్కువ డిస్కౌంట్ లభిస్తే అక్కడ మీరు కొంటారు. ఇలా ధరల్లో తేడా ఉండటానికి పోటీనే కారణం. ఇకపై ఇలాంటి భారీ ఆఫర్లు ఉండవు. ఎందుకంటే ఈ ధరల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ముసాయిదా రూపొందించింది. వీలైనంత త్వరగా దీన్ని అమల్లోకి తీసుకొస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఇ-కామర్స్
ఇ-కామర్స్ పాలసీ ముసాయిదా ప్రకారం ఇలాంటి డిస్కౌంట్లకు తెరపడనుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇ-కామర్స్ షాపింగ్ సైట్స్ మాత్రమే కాదు ఫుడ్ డెలివరీ చేసే స్విగ్గీ, జొమాటోతో పాటు పేటీఎం, అర్బన్‌క్లాప్, పాలసీబజార్ లాంటి వాటికీ ఇవే నిబంధనలు వర్తిస్తాయి. డేటా ప్రైవసీపై జస్టిస్ శ్రీక్రిష్ణ కమిటీ సిఫార్సులతో పాటు ఇ-కామర్స్ పాలసీని అమలు చేస్తారు.

డేటా
డేటా ఫ్లో, ప్రొటెక్షన్, సమస్యల పరిష్కారం, డేటా పరిరక్షణ లాంటి అంశాలపై పలువురి నుంచి సమగ్రమైన సిఫార్సులు తీసుకొని ఇ-కామర్స్ పాలసీ రూపొందించాం. ఇందులోనే నియంత్రణ విధానాల గురించి సిఫార్సులున్నాయి. ఈ ముసాయిదాను అమల్లోకి తీసుకొచ్చేందుకు గడువు విధించలేదు కానీ త్వరలోనే ఇ-కామర్స్ పాలసీకి తుదిరూపు తీసుకొచ్చి అమలు చేస్తాం.

బీ2సీ ఇ-కామర్స్
ప్రస్తుతం ఇ-కామర్స్ రంగంలో ఉల్లంఘనలపై ప్రత్యేకంగా ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలన్న సిఫార్సు కూడా ఇందులో ఉంది. బీ2సీ ఇ-కామర్స్‌లో 49 శాతం మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వాలని సూచించింది

నష్టాలు
ఇ-కామర్స్ పాలసీ అమల్లోకి వస్తే స్థానిక వ్యాపారులకు చాలా మేలు. ఎందుకంటే ఇ-కామర్స్ వెబ్‌సైట్లల్లో భారీ ఆఫర్లతో స్థానిక వ్యాపారులకు ఇంతకాలం నష్టాలు తప్పలేదు. ఇప్పుడు ధరలను నియంత్రించడం, వందశాతం భారతీయ ఉత్పత్తుల్నే అమ్మేలా ప్రోత్సహించడం లాంటి మార్పులతో స్థానిక వ్యాపారులకు ఊరట లభించినట్టే.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications