చిత్తూరు జిల్లా వాసులకు గుడ్ న్యూస్. త్వరలో బంగారు గని తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్‌ను నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ దక్కించుకుంది.

చిత్తూరు జిల్లాలో
చిత్తూరు జిల్లాలో బంగారం గని లీజు కోసం ఈ-వేలం నిర్వహించగా అదానీ, వేదాంత లాంంటి పెద్ద ప్రైవేట్ కపెంనీలను పక్కకు నెట్టి ఎన్ఎండీసీ బిడ్డింగ్‌ను దక్కించుకుంది.

ఎన్ఎండీసీకి
ఎన్ఎండీసీకి విదేశాల్లో కొన్ని గోల్డ్ మైనింగ్ కాంట్రాక్టులు ఉన్నాయి. అయితే, భారత్‌లో ఈ సంస్థకు బంగారు గని కాంట్రాక్ట్ దక్కడం ఇదే ఫస్ట్ టైమ్. త్వరలో బంగారు గనిని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పగించనుంది.

రూ.450 కోట్లు
ఆ తర్వాత అక్కడ పనులు ప్రారంభం అవుతాయి. అభివృద్ధికి సంబంధించి కంపెనీ నిర్ణయం తీసుకుంటుంది. డెవలప్‌మెంట్ కోసం సుమారు రూ.450 కోట్లు అవసరం అవుతాయని అంచనా.

చిగురుగుంట-బిసనట్టంలో
చిత్తూరు జిల్లాలోని చిగురుగుంట-బిసనట్టంలో బంగారు గని 263.01 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ గనిలో 18.3 లక్షల టన్నుల వనరులున్నాయి. ఒక్కో టన్ను నుంచి 5.15 గ్రాముల బంగారం ఉత్పత్తికి అవకాశం ఉంటుంది.

ఈ గని
ఈ గని నుంచి కనీసం 8.5 టన్నుల బంగారం ఉత్పత్తికి అవకాశం ఉంది. ఇది అండర్‌గ్రౌండ్ మైన్. ఈ గని నుంచి ఉత్పత్తి చేసే బంగారం విక్రయ ఆదాయంలో 38.25 శాతాన్ని ప్రభుత్వానికి ఆఫర్ చేస్తుంది.

బంగారం ఉత్పత్తి
గని అభివృద్ధికి అవసరమైన అన్ని అనుమతులు లభించాక ఎన్‌ఎండిసి, ఎపీ ప్రభుత్వం కలిసి ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. బంగారం ఉత్పత్తి ప్రారంభానికి రెండేళ్ల వరకు పట్టొచ్చు.

బంగారం శుద్ధి కేంద్రాన్ని
ఎన్‌ఎండిసి ఇప్పటికే టాంజానియాలో ఓ బంగారం గనిని అభివృద్ధి చేస్తోంది. అక్కడ బంగారం శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది

ఈ ఏడాది
ఈ ఏడాది చివరికల్లా పూర్తి కావచ్చు. ఎన్‌ఎండీసీకి చెందిన ఆస్ట్రేలియా అనుబంధ విభాగం లెగసీ ఐరన్ ఓర్ ప్రస్తుతం పశ్చిమ ఆస్ట్రేలియాలో 17 బంగారం నిక్షేపాలను పరిశీలిస్తోంది.


Click it and Unblock the Notifications