ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 2018 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసంలో 0.3 శాతం వృద్ధితో రూ.9,485 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది నాలుగో త్రైమాసంలో రిలయన్స్ ఇండస్ట్రీ నికర లాభం రూ.9,350 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసంతో పోల్చితే నికర లాభం 4.5 శాతంగా ఉంది. మునుపటిలానే పెట్రో కెమికల్స్ విభాగం రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల ఆర్జనకు వెన్నుదన్నుగా నిలిచింది.

2018 జూన్ మాసంతో ముగిసిన త్రైమాసంలో రిలయన్స్ జియో రూ.612 కోట్ల లాభాలను ఆర్జించింది. అంతకు ముందు త్రైమాసం నమోదైన లాభం(రూ.510 కోట్ల)తో పోల్చితే ఈ త్రైమాసంలో 20 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.
తొలి త్రైమాసంలో అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసికంతో పోల్చితే 10.1 శాతం పెరిగి రూ.1.29 లక్షల కోట్లకు చేరినట్లు రిలయన్స్ వెల్లడించింది. మెరుగైన వ్యాపార నిర్వహణా సామర్థ్యంపై తమ ప్రాధాన్యతను కొనసాగిస్తామని రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీ తెలిపారు. పెట్రో కెమికల్స్ విభాగంలో మెరుగైన ఫలితాలు సాధించగలిగామని, ఇది తమ లాభాలకు మద్దతు చేసిందని వెల్లడించారు. ఈ విభాగంలో 5.7 శాతం వృద్ధితో రూ.40,287 కోట్ల వ్యాపారం చేశామని, రిఫైనరీ విభాగంలో రూ.95,646 కోట్ల వ్యాపారం చేసినట్లు వెల్లడించారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications