రేసుగుర్రంలా పరిగెత్తిన స్టాక్ మార్కెట్ బిజినెస్ వర్గాలలో ఆనందం!

స్టాక్‌మార్కెట్లు రికార్డుల మోత మోగిస్తున్నాయి. కొద్ది రోజులుగా సూచీలు వేగంగా పరుగులు తీస్తున్నాయి. గురువారం ఎట్టకేలకు సెన్సె క్స్, నిఫ్టీ రెండు సూచీలు చరిత్రాత్మక రికార్డులను సాధించాయి. మార్కెట్ చరిత్రలోనే తొలిసారి సెన్సెక్స్ 37,000 పాయింట్లను అధిగమించింది. అలాగే నిఫ్టీ 11,186కు చేరింది. దీంతో సూచీలు సరికొత్త శిఖరాలను చేరుకున్నాయి. మార్కెట్ ము గిసేసరికి సెన్సెక్స్ 126 పాయింట్లు పెరిగి 36,985 వద్ద స్థిరపడింది.

రేసుగుర్రంలా పరిగెత్తిన స్టాక్ మార్కెట్ బిజినెస్ వర్గాలలో ఆనందం!

దలాల్ ‌స్ట్రీట్‌ జిగేల్‌మంది.. పాత రికార్డులను బద్దలుకొట్టి కొత్త రికార్డులను లిఖించింది. అంతకంతకు ఎగబాకుతూ సరికొత్త శిఖరాలను చేరుకుంది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ మార్కెట్‌ చర్రితలోనే తొలిసారిగా 37వేల మార్క్‌పైన స్థిరపడింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ కూడా 11,200 పైన ముగిసింది.

అంచనాలను మించి కంపెనీల త్రైమాసిక ఫలితాలు నమోదవడం, ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉండటం, విదేశీ పెట్టుబడులు పెరగడం, రూపాయి బలపడటం.. దేశీయ మార్కెట్‌ సెంటిమెంట్‌కు కలిసొచ్చాయి. దీంతో లోహా, ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్‌ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఈ పరిణామాలతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు జోరుగా సాగాయి. ఆది నుంచే రికార్డు స్థాయిలో పరుగులుపెట్టాయి. ఈ ఉదయం 200 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్‌.. ఆద్యంతం ఆ జోరు కొనసాగించింది. కొనుగోళ్ల మద్దతుతో 300 పాయింట్లకు పైగా ఎగబాకింది. చివరకు 352 పాయింట్లు లాభపడి 37,337 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 111 పాయింట్ల లాభంతో 11,278 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.71గా కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో ఐటీసీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, టాటామోటార్స్‌, హిందాల్కో, టైటాన్‌ షేర్లు లాభపడగా.. డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, అదానీ పోర్ట్స్‌, టీసీఎస్‌, కోల్‌ఇండియా షేర్లు నష్టపోయాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+