ఫేస్‌బుక్‌కు రెండో త్రైమాసికం ఏమాత్రం కలిసిరాలేదు. డేటా ప్రైవసీ స్కామ్, సోషల్ నెట్‌వర్క్‌లో పోస్ట్ అవుతున్న కంటెంట్ విషయంలో సరికొత్త నియంత్రణ విధానాలు ఫేస్‌బుక్‌పై ప్రభావం చూపించాయి. రెండో త్రైమాసికంలో ఆదాయం 42 శాతం పెరిగినా వాల్‌స్ట్రీట్ అంచనా వేసిన 13.3 బిలియన్ డాలర్ల కన్నా తక్కువగా 13.2 బిలియన్ డాలర్లు మాత్రమే రెవెన్యూ పెరిగింది. గత మూడేళ్లతో పోలిస్తే ఈసారి ఫేస్‌బుక్ మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. అలాగని ఏటేటా 11 శాతం యూజర్లు పెరుగుతున్న ఫేస్‌బుక్ ఆదాయం 42 శాతం అంటే తక్కువేమీ కాదు.

ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో రోజూ 147 కోట్ల యూజర్లు, ప్రతీ నెల 223 కోట్ల యూజర్లు యాక్టీవ్‌గా ఉంటున్నారు. మొబైల్ అడ్వర్టైజింగ్ రెవెన్యూ రెండో త్రైమాసికంలో 91% పెరిగింది. గతేడాది రెండో త్రైమాసికంలో ఇది 87 శాతంగా ఉంది. ఈ లెక్కలు బాగానే ఉన్నాయి కానీ... కంపెనీ షేర్ విలువ ఒక్కరోజే 20 శాతం పడిపోయింది. సీఈఓ మార్క్ జుకర్‌బర్క్ ఆదాయం 16.8 బిలియన్ డాలర్లు అంటే సుమారు 8 లక్షల కోట్లకుపైనే ఆవిరైంది. ఇందుకు కారణం కేంబ్రిడ్జి అనలిటికా డేటా స్కామ్‍తో ఫేస్‌బుక్‌కు మరిన్ని ఇబ్బందులు వస్తాయన్న ప్రచారమే. మూడో త్రైమాసికంలో ఆదాయం భారీగా తగ్గుతుందన్న వార్తలతో షేర్ ధర భారీగా పడిపోయింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications