మీరు సొంతంగా వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నారా? అయితే మీకు ఎలా మొదలు పెట్టాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అసలు ఏ వ్యాపారం పెట్టాలి అని ఆలోచిస్తున్నారా?

శుభవార్త
దీనికోసం అమూల్ కంపెనీ వారు వ్యాపారం పెట్టుకోవాలి అనుకుంటున్నా వారికీ ఒక శుభవార్త తెచ్చింది. అది ఎలాగో దాని వల్ల ఎన్ని లాభాలు వస్తాయో చూద్దామా?

సొంత ఊరిలో
ఇప్పుడు మన సొంత ఊరిలో వ్యాపారం పెట్టుకొని లాభాలు పొందడానికి అమూల్ పాల కంపెనీ వారు అమూల్ ఫ్రాంచెస్ పేరుతో ముందుకొస్తోంది.

అమూల్ ఫ్రాంచెస్
ఈ అమూల్ ఫ్రాంచెస్ వల్ల మీరు మంచి లాభాలు పొందుతారు ఎందుకంటే దీనికి మీరు
ఎటువంటి రాయల్టీలు మరియు లాభాల్లో ఎటువంటి భాగం ఫ్రాంచెస్ కి ఇవ్వనవసరం లేదు. మీరు ఖచ్చితంగా నెలకు రూ.2 నుంచి రూ.6 లక్షలు సంపాదియవచ్చు.

ఈ అమూల్ ఫ్రాంచెస్ పెట్టడానికి ఎంత కావాలో తెలుసా?
అమూల్ మీకు రకరకాల ఫ్రాంచెస్ అందిస్తుంది అందులో మీకు అమూల్ అవుట్లెట్, అమూల్ రైల్వే పార్లర్ మరియు అముల్ కియోస్క్ వీటికోసం మీరు రూ.2 లక్షలు పెట్టుబడిగా పెట్టాలి ఇందులో రూ.25 వేలు బ్రాండ్ సెక్యూరిటీ కోసం ఇది మనకు వెనక్కి ఇవ్వరు. ఇక మిగతా రూ.1 లక్ష మీరు రేనోవేషన్ కోసం మరియు మిగతా రూ.75 వేలు పరికరాల కోసం పెట్టుకోవచ్చు. మీకు మిగతా వివరాల కోసం మీరు అమూల్ కంపెనీ వెబ్ సైట్లో చూసుకోవచ్చు .

ఐస్ క్రీం ఫ్రాంచెస్
ఇక అమూల్ ఐస్ క్రీం ఫ్రాంచెస్ కోసం మీరు రూ.5 లక్షలు పెట్టుబడి అవసరం దింట్లో బ్రాండ్ సెక్యూరిటీ కోసం రూ.50 వేలు మరియు రేనోవేషన్స్ కోసం రూ.4 లక్షలు రూ.1 .5 లక్షలు పరికరాల కోసం పెట్టుకోవాలి.

పెట్టే స్థలం
అమూల్ వారి ప్రకారం ఈ అమూల్ ఫ్రాంచెస్ పెట్టుకొన్న వారు నెలకి రూ.5 నుంచి రూ.10 లక్షలు సంపాదించుకోవచ్చు అని చెబుతున్నారు.దీనికి మీరు పెట్టే స్థలం కూడా సహకరించాలి.

కమిషన్
అమూల్ ప్రాంచెస్ MRP మీద కూడా మీరు కమిషన్ పొందవచ్చు అంటా పాలు ప్యాకెట్లలో 2.5 శాతం మరియు 10 శాతం పాల ఉత్పత్తులు మీద అలాగే 20 శాతం ముందుగా ప్యాక్ చేయబడిన ఐస్ క్రీం మీద మరియు 50 శాతం అమూల్ ఐస్ క్రీం స్కూప్లింగ్ పార్లర్లో విక్రయించబడే రెసిపీ ఉత్పత్తుల మీద.

అమూల్ వారి కండీషయన్స్ :
మీరు అమూల్ అవుట్ లెట్ కోసం ఫ్రాంచెస్ పెట్టాలి అనుకుంటే మీకు ఖచ్చితంగా 150 చదరపు అడుగులు స్థలం ఉండాలి మరియు అమూల్ ఐస్ క్రీం కోసం మీకు ౩౦౦ చదరపు అడుగుల స్థలం ఉండాలి.

సబ్సిడీ
అమూల్ వారి నుంచి మీకు LED సైనేజ్ వస్తుంది అలాగే పరికరాలు మరియు బ్రాండింగ్ మీకు సబ్సిడీ లో వస్తాయి ఇదే కాకుండా మీరు ఫ్రాంచెస్ తీసుకున్నట్లయితే మీకు మీతో పని చేసే బాయ్ కి ట్రైనింగ్ ఇస్తారు.

డీలర్
ప్రతి జిల్లా మరియు టౌన్ , మండలాలలో అమూల్ వారు ఒక హోల్ సేల్ డీలర్ ని నియమించింది, ఈ హోల్ సేల్ డీలర్ మీకు అమూల్ వారి ఉత్పత్తులు అందచేస్తారు.


Click it and Unblock the Notifications