వాట్సప్ టాప్ మెసేజింగ్ సర్వీస్. ఫేస్‌బుక్ సొంతం చేసుకున్న ఈ ప్లాట్‌ఫామ్‌కు అంత పాపులారిటీ రావడానికి మూడు కారణాలున్నాయి.

వాట్సప్
ఒకటి అన్‌లిమిటెడ్ టెక్ట్ మెసేజింగ్. రెండోది సింపుల్ యూఐ. మూడోది ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అప్‌డేట్స్ అందించడం. మెసేజింగ్‌తో పాటు గ్రూప్ చాట్, లొకేషన్ షేరింగ్, వాయిస్, వీడియో కాల్స్ లాంటి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సప్. ఇప్పుడు మరిన్ని ఫీచర్లు యాడ్ చేసింది.

వాట్సప్ గ్రూప్ కాల్:
ఈ ఫీచర్ వాట్సప్ బీటాలో మాత్రమే ఉంది. త్వరలో మిగతావాళ్లకూ ఈ ఫీచర్‌ను అందించనుంది వాట్సప్. ఈ కొత్త ఫీచర్ మొదట విండోస్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. మొత్తం నలుగురు ఒకేసారి గ్రూప్ కాల్ మాట్లాడొచ్చు. వీడియో కాలింగ్ యాప్స్ అయిన గూగుల్ డ్యుయో, స్కైప్‌లకు పోటీ ఇవ్వనుంది వాట్సప్.

అడ్మిన్‌ను డిస్మిస్ చేయడం:
ఇది వాట్సప్ గ్రూప్స్ కోసం రూపొందించిన ఫీచర్. గ్రూప్ అడ్మిన్స్ మిగతా అడ్మిన్లను డిమోట్ చేసే అవకాశముంటుంది. గతంలో ఇతర అడ్మిన్లను గ్రూప్‌లోంచి తొలగించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డిమోట్ చేస్తే చాలు. ఇది గ్రూప్ ఇన్ఫో మెనూలో ఉంటుంది

డిలిట్ చేసిన మీడియా ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేయడం:
గతంలో మీరు వాట్సప్‌లో ఫోటోలు, వీడియోలు డిలిట్ చేశారా? ఏం పర్లేదు మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సప్. గతంలో అయితే ఒక్కసారి డిలిట్ చేస్తే ఇక ఆ ఫైల్ కనిపించేది కాదు. ఇప్పుడు మాత్రం ఆ ఫైల్ సర్వర్‌లో ఉంటుంది కాబట్టి మీరు మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ఫార్వర్డ్ మెసేజ్‌కు లేబుల్:
వాట్సప్‌లో సర్క్యులేట్ అయ్యేవి ఎక్కువగా ఫార్వర్డ్ మెసేజ్‌లే. అయితే అది పంపిన వ్యక్తి సొంతగా రూపొందించిన మెసేజా, లేక ఫార్వర్డ్ మెసేజా అన్నది గతంలో తెలిసేది కాదు. ఇప్పుడు ఆ మెసేజ్‌పై ఫార్వర్డ్ లేబుల్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ గతంలో ఆండ్రాయిడ్ బీటా వర్షన్‌లో ఉండేది. ఇప్పుడు అందరి వాట్సప్‌లో కనిపిస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications