ఫేక్ న్యూస్ నకిలీ వార్తలు ఇప్పుడు ప్రపంచానికి ఓ పెద్ద సవాల్. ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ ఈ ఫేక్ న్యూస్ ఎన్నో అనర్థాలకు కారణమవుతోంది.

ఓ స్టార్టప్
ఏకంగా ప్రాణాలు కూడా పోతున్నాయి. వీటిపై పోరాడేందుకు భారత సంతతికి చెందిన ఆంట్రప్రెన్యూర్ యూకేలో ఓ స్టార్టప్ ప్రారంభించారు

ఫేక్ న్యూస్‌ని
మెషీన్ లెర్నింగ్ ఆల్గారిథమ్ సాయంతో కల్పిత వార్తల నుంచి నిజాలను వెలికితీయడమే ఈ స్టార్టప్ పని. ప్రపంచవ్యాప్తంగా ఫేక్ న్యూస్‌ని ఫిల్టర్ చేసే ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా ఇండియా కోసం రూపొందించారు.

మైసూర్‌వాసి
లిరిక్ జైన్ మైసూర్‌వాసి. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. గతేడాది వెస్ట్ యార్క్‌షైర్‌లో స్టార్టప్ ప్రారంభించారు. కొందరు భాగస్వాములు, సలహాదారుల సాయంతో టెక్నాలజీకి మెరుగులు దిద్దుతున్నారు.

మిగతా న్యూస్
సెప్టెంబర్‌లో యూకే, యూఎస్‌లో పబ్లిక్ లాంఛ్ చేస్తారు. ఇండియాలో అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది. ఇది మిగతా న్యూస్ వెబ్‌సైట్లలానే పనిచేస్తుంది. అయితే వార్తల్లో ఖచ్చితత్వాన్ని, వాస్తవాల్ని వెలికితీయడమే ఈ స్టార్టప్ పని.

మెషీన్ లెర్నింగ్
లాజిక్ అల్లీ ప్లాట్‌ఫామ్ 70,000 డొమైన్ల నుంచి వార్తా కథనాలను సేకరిస్తుంది. ప్రతీ కథనంలో విశ్వసనీయత ఎంతో గుర్తిస్తుంది. ఇదంతా మెషీన్ లెర్నింగ్ ఆల్గారిథమ్ ద్వారా జరుగుతుంది

యూజర్లకు
అందులో నిజానిజాలేంటీ, రాజకీయ పక్షపాతం ఉందా, గణాంకాలన్నీ సరైనవేనా లాంటి పరిశీలన అంతా మెషీన్ లెర్నింగ్ ఆల్గారిథమ్‌తో జరిగిపోతుంది. దీని ద్వారా యూజర్లకు పారదర్శకమైన వార్తల్ని తెలుసుకునే అవకాశముంటుంది.

వాట్సప్ మెసేజింగ్
భారతదేశంలో వాట్సప్ మెసేజింగ్ సర్వీస్‌లో షేర్ అవుతున్న ఫేక్ న్యూస్ ఎన్నో సమస్యల్ని సృష్టిస్తోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనుషుల కన్నా వేగంగా ఆ వార్తలు నిజమైనవో కావో తెలుసుకునే అవకాశం ఈ స్టార్టప్ ద్వారా లభిస్తుంది.

20 కోట్లకు
భారతదేశంలో 20 కోట్లకు పైనే వాట్సప్ యూజర్లున్నారు. అయితే ఎన్‌క్రిప్ట్ విధానంతో ఫేక్ న్యూస్ ఆపడం సాధ్యం కావట్లేదు.

వాట్సప్ చాట్‌బోట్‌లో
రెచ్చగొట్టే స్వభావం గల కథనాలతో ప్రజలు వేగంగా స్పందిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఫేక్ న్యూస్ గుర్తించేలోపే జరగరానిది జరిగిపోతోంది. అందుకే వాట్సప్ చాట్‌బోట్‌లో అప్పటికప్పుడే ఆ వార్తను ధృవీకరించే పద్ధతిని రూపొందించబోతున్నాం. మా ప్రణాళికలన్నీ ఈ ఏడాది చివరి నాటికి వెల్లడిస్తాం.

మిలియన్ పౌండ్ల
అమెరికాకు చెందిన మసాచ్యూట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంగ్లాండ్‌కు చెందిన కేంబ్రిడ్జి యూనివర్సిటీ పూర్వవిద్యార్థులు లాజిక్ అల్లీ స్టార్టప్‌లో అడ్వైజర్లుగా ఉన్నారు. ఇప్పటికే ఒక మిలియన్ పౌండ్ల ఫండింగ్ వచ్చింది.

న్యూస్ ఫీడ్
అమెరికా, ఇంగ్లాండ్, ఇండియాకు చెందిన 38 మంది ఉద్యోగులున్నారు. త్వరలో మరికొందర్ని నియమించుకోనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలయికతో ఈ ప్లాట్‌ఫామ్ పనిచేస్తుందని అంటున్నారు స్టార్టప్ నిర్వాహకులు. ఇంటెలిజెన్స్ న్యూస్ ఫీడ్ ఇవ్వడం ఫ్యూచర్ జర్నలిజం అని చెబుతున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications