డాలర్ తో పోల్చి చూస్తే పుంజుకున్న రూపాయి మారకం.

సోమవారం నాడు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి బలపడింది. సోమవారం ఉదయం 9.15 సమయానికి రూపాయి 68.72 వద్ద ఉంది.

సోమవారం నాడు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి బలపడింది. సోమవారం ఉదయం 9.15 సమయానికి రూపాయి 68.72 వద్ద ఉంది, దాని మునుపటి ముగింపు 68.85 నుండి 0.20% పెరిగింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి 68.77 వద్ద ప్రారంభమైంది.

డాలర్ తో పోల్చి చూస్తే పుంజుకున్న రూపాయి మారకం.

10 సంవత్సరాల బాండ్ దిగుబడి 7.788% వద్ద ఉంది,శుక్రవారం నాటికి 7.786% వద్ద ముగిసినది. బాండ్ దిగుబడి మరియు ధరలు వ్యతిరేక దిశల్లో కదులుతాయి.

బెంచ్మార్క్ సెన్సెక్స్ ఇండెక్స్ 0.17 శాతం లేదా 60.53 పాయింట్లు పెరిగి 36,556.90 వద్ద ముగిసింది. జనవరి నుంచి, అది 6.6% పెరిగింది.

ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి విలువ 6.55 శాతం బలహీనపడింది. విదేశీ పెట్టుబడిదారులు వరుసగా 999.80 మిలియన్ డాలర్లు, 6.29 బిలియన్ డాలర్లు ఈక్విటీ, డెట్ మార్కెట్లలో విక్రయించారు.

పాదరక్షలు, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ మరియు చిన్న స్క్రీన్ టీవీలతో సహా 88 వస్తువులపై శనివారం GST కౌన్సిల్ సమావేశం లో పన్ను కు సంబంధించి, విస్తృతంగా డిమాండ్ చేసిన సానిటరీ నేప్కిన్లు లెవీ నుంచి మినహాయించబడ్డాయి.దీనివల్ల ప్రతి సంవత్సరం రూ .15,000 కోట్ల ప్రభుత్వం ఆదాయం తగ్గుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం గడిచిన కొద్ది వారాల్లో జిఎస్టి రేట్లను తగ్గించింది.

కొత్త జిఎస్టి రేట్లు 27 జులైలో ప్రభావవంతంగా ఉంటాయి మరియు చిన్న వ్యాపారాలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించడానికి ప్యానెల్ ఆగస్టు 4 న మల్లి సమావేశం కానుంది.

అమెరికా కరెన్సీ డాలరు నష్టాల్లో ట్రేడవుతోంది. దక్షిణ కొరియా ఒన్‌ 0.5 శాతం, జపాన్‌ యెన్‌ 0.48 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.31 శాతం, ఇండోనేసియా రూపియ 0.17 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.14 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.15 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.15 శాతం పెరిగాయి.

ప్రధాన కరెన్సీలపై అమెరికా కరెన్సీ బలం కొలిచే డాలర్ ఇండెక్స్ 94.31 వద్ద ముగిసింది, అంతకు ముందు 94.476 పాయింట్ల నుంచి 0.18 శాతం పడిపోయింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+