అంబానీలేంటి వెరైటీ లీడర్లేంటి అనుకోకండి. ప్రపంచ వినోద పరిశ్రమ రూపురేఖల్ని మార్చగలిగిన సత్తా ఉన్న 500 మంది అగ్ర నాయకులతో వెరైటీ మ్యాగజైన్ జాబితాను రూపొందించింది.

టాప్-500
ఈ టాప్-500 గ్లోబల్ లీడర్లలో బిలియనీర్ సోదరులైన ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీలకు చోటు దక్కింది. మొత్తం 12 మంది భారతీయులకు ఈ ప్రతిష్ఠాత్మక లిస్టులో స్థానం లభించగా, వీరిలో అంబానీలతోపాటు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, ప్రముఖ నటి ప్రియాంక చోప్రా, రచయిత, దర్శకుడు కరణ్ జోహార్.

ఆదిత్యా చోప్రా
స్టార్ ఇండియా సీఈవో ఉదయ్ శంకర్, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర, యశ్ రాజ్ ఫిల్మ్స్ చైర్మన్ ఆదిత్యా చోప్రా, బాలాజీ టెలీఫిల్మ్స్ జాయింట్ ఎండీ ఎక్తా కపూర్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈవో పునీత్ గోయెంకా, ఏరోస్ ఇంటర్నేషనల్ సీఈవో కిశోర్ లుల్లా, ది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధ్యక్షుడు సిద్ధార్థ్ కపూర్ ఉన్నారు.

వెబ్‌సైట్‌లో
2 లక్షల కోట్ల డాలర్ల విలువైన ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీని ప్రభావితం చేసే నాయకులతో తయారైనదే మా ఈ వెరైటీ500 సూచీ అని తమ వెబ్‌సైట్‌లో వెరైటీ మ్యాగజైన్ పేర్కొన్నది

లిస్టును
ఏటా విడుదలయ్యే ఈ జాబితా కోసం వెరైటీ ఎడిటోరియల్ బోర్డు ప్రపంచ సినీ, టెలివిజన్ పరిశ్రమ పోకడల్ని నిశితంగా గమనిస్తుంది. ఆ తర్వాత అత్యంత ప్రభావశీలురతో లిస్టును సిద్ధం చేస్తుంది.

జియోతో
డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ముకేశ్ అంబానీ తన రిలయన్స్ జియోతో షేక్ చేస్తున్నారని, 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారని వెరైటీ మ్యాగజైన్ ఈ సందర్భంగా తెలిపింది.

నవ శకానికి
జియో రాకతో ఇంటర్నెట్ చౌకగా మారిందని, దాని వినియోగం కూడా పెరిగిపోయిందని, ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలో ఓ నవ శకానికి జియో నాంది పలికిందని కీర్తించింది.

అనిల్ అంబానీ సైతం
అనిల్ అంబానీ సైతం మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో దూకుడును ప్రదర్శించారని, అటు సినిమా, ఇటు టెలివిజన్ విభాగాల్లో తనదైన ముద్ర వేసినట్లు చెప్పింది. ఆడ్‌ల్యాబ్స్ కొనుగోలుతోపాటు, స్టీవెన్ స్పీల్‌బర్గ్ డ్రీమ్‌వర్క్స్‌లో 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారని గుర్తుచేసింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications