రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ సారథ్యంలోని టెలికాం సంస్థ రిలయన్స్ జియో జియో మాన్‌సూన్ హంగామా పేరిట ప్రకటించిన సరికొత్త ఆఫర్ జులై 21 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఆఫర్‌ను కంపెనీ 41 వార్షిక సమావేశంలో ప్రకటించిన విషయం తెల్సిందే.

ఈ ఆఫర్ కింద
ఈ ఆఫర్ కింద వినియోగదారులు తమ వద్ద ఉన్న ఏదైనా పాత ఫీచర్ ఫోన్ ఇచ్చి జియో ఫోన్‌ని కేవలం రూ.501కు పొందవచ్చు. ఆగస్టు 15 నుంచి ప్రస్తుత జియో ఫోన్‌లో వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది.

ఎక్సేంజ్
ఎక్సేంజ్ ఆఫర్ కింద రూ.501 చెల్లించి కొత్త జియో ఫోన్ పొందవచ్చు. అయితే, జియో మాన్ సూన్ ఆఫర్‌లో కొత్తగా ఫోన్ కొనాలంటే మాత్రం రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది.

వైబ్‌సైట్‌లో
దీనికి సంబంధించి ఇప్పటికే పలు ఆఫర్లు ప్రారంభమయ్యాయి. ఈ ఆఫర్‌లో జియో ఫోన్ కావాలనుకునే కస్టమర్ల వైబ్‌సైట్‌లో తమ పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ అడ్రస్, మీ ప్రాంత పిన్ కోడ్ వివరాలను అందించాల్సి ఉంటుంది.

జియో ఫోన్ 2
ఈ ఆఫర్ కింద అందించే జియో ఫోన్ 2 ఫీచర్లను పరిశీలిస్తే, 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, క్వర్టీ కీప్యాడ్, కిఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరణ, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ, వాయిస్ ఓవర్ వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్, బ్లూటూత్, ఎఫ్‌ఎం రేడియో, 2 మెగాపిక్సెల్ సెన్సార్, వీజీఏ సెన్సార్, డ్యూయల్ సిమ్ కార్డు సపోర్టు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications